పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలైనవాళ్ళ బోధలున్నాయికదా! వాటిని జ్ఞప్తికి తెచ్చుకొంటే నీ సోదరులకు పరివర్తనం కలుగుతుంది అన్నాడు అబ్రాహాము. పూర్వవేదంలో మోషే, ప్రవక్తలూ దయాదాక్షిణ్యాలనూ సాంఘిక న్యాయాన్నీ బోధించారు. ఇదే రచయితలు క్రీస్తు జీవిత సారాంశాన్ని గూడ ముందుగనే వర్ణించారు - లూకా 24, 27; 44. కాని ధనవంతుడు పై రచయితల బోధలు చాలవనీ, లాజరు ఉత్థానమై భూలోకానికి వెళ్లే సోదరులకు మనసు కరుగుతుందనీ వాదించాడు. అబ్రాహాము అతని వాదాన్ని ఖండిస్తూ పూర్వవేద బోధలను లక్ష్యపెట్టనివాళ్ళ ఒకడు ఉత్తానమై కన్పిస్తే మాత్రం అతని మందలింపులను అలిస్తారా అని ప్రశ్నించాడు.

క్రీస్తునాడు సదూకయులలో ధనవంతులైన నాయకులుండేవాళ్లు, వాళ్ల వర్తకులు, భూస్వాములు, ప్రభుత్వోద్యోగులు మొదలైనవాళ్లు, ఈ ధనిక నాయకులు సుఖభోగాల్లో మునిగి తేలుతూ దేవుణ్ణి విస్మరిస్తూండేవాళ్లు, పై ఐదుగురు సోదరులు ఈ ధనిక వర్గానికి సంకేతం.

ఇంకా, యూదులు చాలసార్లు క్రీస్తుని అద్భుతాలు చేయమని కోరారు. కాని క్రీస్తు వాళ్ళ కోరికను తీర్చలేదు. ప్రజలు కుతూహలంతో అడిగినందుకు అతడు ఒక్క అద్భుతంకూడ చేయలేదు. ఇక్కడ లాజరు ఉత్థానం కావడం ఓ అద్భుతం లాంటిది. విశ్వాసం లేనివాళ్ళకు అలాంటి అద్భుతాల వలన ఫలితంలేదని క్రీస్తు హృదయం, యథార్థంగా క్రీస్తు ఉత్తానమైనంక మాత్రం యూదులు అతని బోధలను అంగీకరించారా? మరి నిరుపేదయైన లాజరు ఉత్తానం మాత్రం ఏం ఫలితం సాధించి పెడుతుంది?

3. భావం

ఈ సామెతకు "ధనవంతుడు - లాజరు" అని పేరు. దీనిలో ముఖ్యభాగం మొదటిదిగాదు, రెండవది. అసలు లాజరు దీనిలో ప్రధానపాత్ర కానేకాదు. ఈ సామెతను “ఆరురు ధనిక సోదరులు" అని పిలవడం మేలు. కథానాయకులు వీళ్ళ వీళ్ళంతా దేవుణ్ణి విస్మరించి సుఖభోగాల్లో మునిగి తేలేవాళ్ళు ధనాన్ని నమ్మకొన్నవాళ్ళు ఈలాంటి వాళ్ల క్రీస్తుని అద్భుతాలు చేసి చూపమని అడుగుతూంటారు. కాని వీళ్ళకు ఉత్తానమంతటి అద్భుతాన్ని చూపించినా లాభంలేదు. అసలు మనం రక్షణం పొందేది దైవవాక్యాన్ని వినడంవల్లగాని అద్భుతాలను చూడ్డంవల్ల గాదు, కనుక ప్రాపంచిక జీవితం జీవించే ధనవంతులు, యూదనాయకులు, నిద్రమత్తు వదలుకొని క్రీస్తు బోధలు ఆలించాలి. సుఖభోగాలనూ సిరిసంపదలనూ నమ్మకొంటే వాళ్ళు తప్పకుండా నాశమైపోతారు - ఇది ఈ సామెత భావం.

4. అన్వయం

జలప్రళయానికి ముందు భక్తితో జీవించినవాడు నోవా ఒక్కడే తతిమ్మా జనమంతా తింటూ త్రాగుతూ పెండ్లిజేసికొంటూ సమస్త సుఖభోగాలూ అనుభవిస్తూ