పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాశమైపోతాడని భావం. ఈలాగే మరియ మగ్డలీనకు ఏడు దయ్యాలు ఉన్నాయి అంటే ఆమె పూర్తిగా దయ్యం అధీనంలో ఉంది అని అర్ధ - లూకా 8,2. ఈ దయ్యం నిర్ణన ప్రదేశం వెదకి వచ్చింది. బైబుల్లో నిర్ణన ప్రదేశం లేక ఎడారి దయ్యాలకు వాసస్థలం.

ఇక్కడ ఇల్ల శుభ్రంగా వుందేగాని ఖాళీగా వుండిపోయింది. అనగా పిశాచం వెళ్ళిపోయాక నరుని హృదయం శూన్యంగా ఉండగూడదని భావం. కనుక పిశాచాన్ని పారద్రోలినంత మాత్రాన్నే చాలదు. దయ్యం వెళ్ళిపోయాక మన హృదయం ఒట్టినే ఉండిపోకూడదు. ఆ హృదయంలో దేవుణ్ణి నిల్పుకోవాలి. అనగా మన హృదయంలో దైవ సామ్రాజ్యం నిండివుంటే, ఇక పిశాచ సామ్రాజ్యానికి తావుండదని భావం.

2. అన్వయం

మన హృదయంలో దేవుడూ దేవుని ఆత్మా ఓ దేవళంలో లాగ వశిస్తుంటారు అన్నాడు పౌలు - ఎఫె2, 22. ఇది చాల మంచి భావం. ప్రభువనీ ఆ ప్రభు సామ్రాజ్యాన్నీ హృదయంలో నిల్పుకొన్న భక్తుడు ధన్యుడుకదా!

ఈ దైవరాజ్యపు సామెతలన్నీ ప్రకృతిమీద అల్లినవి, ప్రకృతి రహస్యాలను ఆధారంగా తీసికొని ప్రభువు దైవరాజ్యసూత్రాలను వివరించాడు. ఆలోచన కలవాళ్ళకు ప్రకృతి నిత్యజీవితంలో ఎన్నో సత్యాలను బోధిస్తుంది.

4. త్వరపడాలి అనే సామెతలు

ప్రభువు రక్షణాన్ని ప్రసాదించే కాలం ఆసన్నమైంది. మెస్సియా రానే వచ్చాడు. ప్రజలను దైవరాజ్యంలోకి చేర్చుకొనేది అతడే. కాని అతడు కొలది కాలంపాటు మాత్రమే ఉంటాడు. కనుక ప్రజలు అతని బోధలను సత్వరమే ఆలించాలి. శీఘంగా పరివర్తనం చెంది దైవరాజ్యంలో చేరాలి. ఈ రక్షణకాలం దాటిపోతే ఇక సదవకాశం లభించదు. జాప్యం చేసేవాళ్ళు సర్వనాశమైపోతారు. శిక్షకు గురౌతారు. కనుక ప్రజలు సత్వరమే పరివర్తనం చెందాలి. ఆలస్యం చేయకూడదు - ఈలాంటి భావాలను బోధించే సామెతలు సువిశేషాల్లో ఓ పదిదాక ఉన్నాయి. వీటికి "త్వరపడాలి అనే సామెతలు" అని పేరు. ఇక ఈ వర్గం సామెతలను క్రమంగా పరిశీలిద్దాం.

1. విందు సామెత - లూకా 14, 15-24

1. సందర్భం

ఓ మారు క్రీస్తు కొందరు అతిథులతో విందారగిస్తుండగా అక్కడ ఓ అతని దైవరాజ్యంలో విందు భుజించేవాళ్లు ఎంతటి ధన్యాత్ములోగదా అన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభువు ఈ విందు సామెతను చెప్పాడు.