పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ నిధికి విలువ ఇచ్చినట్లే మనం కూడ దైవరాజ్యానికి విలువనీయాలి, దాన్ని ఏలాగైనా సంపాదించుకోవాలి. నిధికీ దైవరాజ్యానికీ ఎనలేని విలువనీయడం - ఇది యీ సామెతలోని పొలిక.

పై నిధిలాంటిదే ఆణిముత్యం సామెత గూడ. ఆనాడు జూలియస్పీజరు వద్దా, క్లియోపాత్ర రాణి వద్దా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ముత్యాలు వుండేవట. యూదులకు కూడ ముత్యాలంటే మాలావు ఇష్టం. వాటిని దండలుగా గుచ్చి మెడలో ధరించేవాళ్లు, ఇక మన కథ చెప్పడం, ఓ అతనికి మూత్యాలు కూడబెట్టడమంటే ఎంతో సరదాగా ఉండేది. అతడు ఓ మారు ఎంతో విలువైన ముత్యాన్ని చూచాడు. ఇక అతనికి నిదురపట్టలేదు. కనుక తన ఆస్తి నంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనితెచ్చుకొన్నాడు. తన ముచ్చట తీర్చుకొన్నాడు. పై సేద్యగాడు నిధికి అపారమైన విలువ నిచ్చినట్లే ఇతడు కూడ ఈ ముత్యానికి అనంతమైన విలువ నిచ్చాడు. ఈ రెండు సామెతల్లో గూడ క్రీస్తు సామ్రాజ్యానికి విలువ నీయడమే ముఖ్యాంశం.

2. అన్వయం

నాల్గవ శతాబ్దపు భక్తుడు జెరోము ఈ సామెత విూద వ్యాఖ్య చెపూ క్రీస్తే మన నిధి అని వ్రాసాడు. బైబులు అనే పొలంలో దాగివున్న మహా విలువ గల నిధి క్రీస్త. మనం ఆ గ్రంథంతో పరిచయం కలిగించుకొని ఆ నిధిని పొందాలి. అప్పుడే మనం ఉత్తమ విలువను చేపట్టినవాళ్ళం ఔతాం. పైగా క్రీస్తు బైబులు గ్రంథంలో దాగివున్న నిధి. కనుక ఆ గ్రంథం తెలియని వాళ్ళకు క్రీస్తుంటే యేమిటో తెలీదు అన్నాడు జెరోము. ఆ మహానుభావు పదహారువందల యేండ్లనాడు వ్రాసిన ఈ మాటలు ఈనాడూ మన క్యాతలిక్ సమాజానికి అక్షరాలా వర్తిస్తున్నాయి. మనవాళ్ళకు బైబులూ తెలియదు, ఆ బైబులు బోధించే క్రీస్తూ తెలియదు. ఇంతకంటె దౌర్భాగ్యం ఏముంది?

6. దుష్టాత్మ - మత్త 12, 43-45.

1. వివరణం

భక్తుల హృదయం దైవరాజ్యంతో నిండి వుండాలి గాని పిశాచ రాజ్యంతో నిండి ఉండగూడదని ఈ సామెత భావం. ఈ సామెతలో “ఇల్లు” అంటే నరుడే యూదుల భాషలో "ఆ ఇంట్లో దయ్యం ప్రవేశించింది" అంటే ఆ నరుళ్ళి దయ్యం ప్రవేశించిది అని అర్థం. ఓ అతన్ని దయ్యం విడిచి వెళ్ళిపోయింది. కానీ అతని హృదయం ఖాళీగా ఉంది. ఆ హృదయంలో దేవుడూలేడు దయ్యమూ లేదు. అప్పుడు పిశాచం పూర్ణబలంతో తిరిగివచ్చి అతన్ని మళ్ళా ఆవేశించింది. ఇక్కడ 44వ వచనంలో ఏడు దయ్యాలు అనే మాటలో ఏడు సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది. అనగా ఆ వ్యక్తి దయ్యానికి చిక్కి పూర్తిగా