పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సామెత లోని ప్రధానపాత్ర వితంతువు గాదు. న్యాయాధిపతి. కనుక ఇక్కడ ప్రధానాంశం మనం ఏలా ప్రార్థన చేయాలి అని కాదు. దేవుడు మన ప్రార్ధన తప్పక వింటాడు అని. పూర్వపు సామెత లాగే ఇది కూడ నరుల పక్షాన్ని గాదు, దైవపక్షాన్ని వర్ణిస్తుంది. దానిలాగే ఇదికూడ భగవంతుడు నరులలాంటివాడు అని చెప్పదు. నరులలాంటి వాడు కాడు అని చెప్తుంది.

2. అన్వయం

బైబులు భగవంతుణ్ణి తల్లితోను తండ్రితోను స్నేహితునితోను పోలుస్తుంది. ఈ వుపమానాలన్నీ మనకు ఆ ప్రభువు పట్ల నమ్మిక ఉండాలని సూచిస్తాయి. భగవంతుణ్ణి నమ్మినవాళ్ళకు చెరుపలేదు. పై రెండు సామెతల్లోని సారం ఇదే. "ఐగుప్తియులు రథాలనూ గుర్రాలనూ నమ్మకున్నారు, మేమైతే ప్రభువుని నమ్మకొన్నాం" అన్న కీర్తన కారుని వాక్యం ఈ పట్టున స్మరింపదగ్గది - 20,7.

7. తంద్రీకుమారులు - మత్త 7,9-11

1. వివరణం

ఈ చిన్న సామెతలో బైబుల్లోని సారమంతా యిమిడి ఉంది. భగవంతుడు తండ్రిలాంటి వాడు. నరుడు అతని బిడ్డలాంటివాడు - ఇది బైబుల్లోని ప్రధాన సత్యం. ఈ సామెత బోధించేది కూడ యిదే. కుమారుడు రొట్టె నడిగితే తండ్రి రాతి నివ్వడు. చేప నడిగితే పాము నివ్వడు. రాయి పాము చిన్న బిడ్డలకు హానికరమైనవి. తండ్రి బిడ్డలకు హితకరమై భోజనంగా ఉపయోగపడే రొట్టె చేపలు మాత్రమే అందిస్తాడు. ఇక, భూలోకంలోని తండ్రులు అపరిపూర్డులు, చెడ్డవాళ్ళ కూడ. చెడ్డవాడైన తండ్రులే తమ బిడ్డలకు ఇంత మేలు చేస్తుంటే, పరిపూరుడూ మంచివాడూ ఐన పరలోకపు తండ్రి నరులకు ఇంకా యెంత మేలు చేస్తాడో ఊహించండి! కనుక బిడ్డలు తండ్రిని నమ్మినట్లే శిష్యులు కూడ పరలోక పితను నమ్మాలి అని సామెత భావం.

2. అన్వయం

ప్రార్థనను గూర్చి చెప్పవలసి వచ్చినపుడు ఈ సామెత కంటె గొప్పది మరొకటి బైబుల్లో లేదు. భక్తుడు భగవంతుని తండ్రిలాగానూ తన్ను బిడ్డనులాగానూ భావించుకొని ప్రార్ధనం చేసికోవాలి. కీర్తనకారుడు "పాలు త్రాగి తల్లి రొమ్ము విూద ప్రశాంతంగా పండుకొన్న పసిబిడ్డలాగే నా హృదయం కూడ నిమ్మళంగా ఉంది" అన్నాడు – 131,2. తల్లి రొమ్ము మిూదలాగే ఆ భగవంతుని రొమ్ము విూద పండుకోవడం - ఇది యెంత చక్కని భావం!

8. మేకలు - గొర్రెలు - మత్త 25, 31-46

1. సందర్భం

క్రీస్తు శిష్యులకు కడతీర్పు జరుగుతుంది. ప్రభువు ఆజ్ఞలను పాటించారా లేదా అన్నదాన్ని బట్టి వాళ్ళకు న్యాయవిచారణం జరుగుతుంది. కాని క్రీస్తు శిష్యులు కాని