పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1) వీళ్ళ ఆచారవాదులు. ఏవేవో బాహ్యచారాలకు మాత్రమే విలువనిచ్చి న్యాయము, దయ, సత్యం మొదలైన ప్రధానాంశాలను విస్మరించారు. ఇదంతా ఏలాగుందంటే దోమను వడకట్టి ఒంటెను బ్రింగినట్లుగా వుంది - మత్త 23, 23-24.

2) పరిసయులు గొప్ప దుర్గునం, వాళ్ళ గర్వం. వాళ్లు ప్రజానాయకులమని చెప్పకొంటూండేవాళ్లు. కాని ఈ నాయకులు గ్రుడ్డివాళ్లు కనుక వాళ్ళేగాదు, వాళ్లు నడిపించిన వాళ్లు గూడ గోతిలో బడ్డారు - 15, 14 వీళ్లు విందుల్లో ప్రార్థనా మందిరాల్లో ప్రముఖ స్థానం కోరుకొనేవాళ్లు - 23,6. పైపెచ్చు సుంకరులను గడ్డిపోచతో సమానంగా జూచేవాళ్లు, తాము దప్పితే మరెవ్వరూ నీతిమంతులు కారని భావించేవాళ్లు.

3) పరిసయులు తమ బోధలను తామే అనుసరించలేదు. కనుకనే క్రీస్తు వీళ్ళను సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. ఈ సమాధులు వెలుపలికి శుభ్రంగా కనిపించినా లోలోపల దుర్గంధవస్తువులతో నిండి వుంటాయి. ఈ డాంబికుల ప్రవర్తనం గూడ ఈలాంటిదే - 23,37. మన మాచరించని నీతులు ఇతరులకు బోధించడం సులభం. అలాగే వీళ్ళగూడ ప్రజల భుజాలమిూద మోషే కట్టడలనే పెద్ద బరువులను మోపారు కాని ఆ భారాలను మోయడంలో వాళ్ళకు ఏ మాత్రమూ సాయపడలేదు - 23,4.

ఈ పరిసయుల తప్పలు మనం కూడ చేస్తూనే వుంటాం. తోడి మానవుల పట్ల కరుణ జూపడం మాని ఏవేవో అర్థంలేని నియమాలను పాటించాలని తాపత్రయ పడుతూంటాం. కాని అన్ని నియమాల కంటె పెద్ద నియమం తోడి మానవుణ్ణి ప్రేమించడం. క్రీస్తు బోధల్లో ఇంతకంటె గొప్ప సత్యం లేదు.

2. శిష్య ధర్మాలు

క్రీస్తు సామెతల్లో కొన్ని శిష్యధర్మాలను బోధించేవి. ఈ సామెతలన్నీ క్రీస్తు శిష్యులు ఏలా మెలగాలో చెప్తాయి. శిష్యులు అక్కరలో వున్న వాళ్ళను ఆదుకోవాలి. స్వార్గాన్ని త్యజించాలి. ప్రభువు ఆజ్ఞలను పాటించాలి. వినయంతో మెలగాలి. పరలోకం లోని తండ్రివిూద నమ్మిక పెట్టుకోవాలి, తోడిజనం పట్ల ప్రేమభావంతో ప్రవర్తించాలి, శిష్యులకు కన్ను ఉప్ప, దీపం ఉపమానాలు. ఒకే యజమానుణ్ణి సేవించాలి. ఇరుకు మార్గంలో పయనించాలి. మేడిపట్టి మల్లా వెనక్కుచూడకూడదు. ఈలాంటి శిష్యధర్మాలను బోధించే సామెతలు పెద్దవి ఎన్మిదిదాకా, చిన్నవి పండ్రెండుదాకా వున్నాయి. ఈ క్రింద వాటిని సంగ్రహంగా పరిశీలించి చూద్దాం.

1. మంచి సమరయుడు - లూకా - 10, 25-37

1. సందర్భం

ఓమారు ఓ ధర్మశాస్త్ర బోధకుడు మోక్షం పొందాలి అంటె నేనేమి చేయాలి అని క్రీస్తుని ప్రశ్నించాడు. క్రీస్తు అతనికి మళ్ళా ప్రతిప్రశ్న వేసి ధర్మశాస్త్రంలో ఏముంది అని