పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీమోనులో ఆమెలోవున్నంత భక్తిభావంగాని కృతజ్ఞతాభావం గాని లేదు. అతడు పరపతి కోసం క్రీస్తుని విందుకు ఆహ్వానించాడు అంతే తన యింటికి వచ్చిన క్రీస్తుకి చేయవలసిన మర్యాదలు కూడ సరిగా చేయలేదు. పైగా అతడు ఆ స్త్రీని తప్పబట్టాడు. పాపాత్మురాలు గదా అని ఆమెను శంకించాడు. ఈ విధంగా అతడు పరిసయలందరు చేసే దుర్విమర్శే చేసాడు. అందుచే క్రీస్తు అతన్ని హెచ్చరించి పాపాత్ముల పట్ల కనికరం జూపాలి గాని వాళ్ళను విమర్శించగూడదని బోధించాడు. అందుకే యిది గూడ కారుణ్యపు సామెతల వర్గానికి చెందిన సామెత ఐంది.

3. అన్వయం

47వ వచనంలో "ఆమె అధికంగా ప్రేమించింది” అంటే అధికంగా కృతజ్ఞతా భావం చూపింది అని భావం, క్రీస్తు పాదాలను కన్నీటితో తడపడంలో వాటిని తల వెండ్రుకలతో తుడవడంలోను ఆమె కృతజ్ఞత వ్యక్తమైంది. ఈ గాఢ కృతజ్ఞతకు కారణం ప్రభువు ఆమె విస్తార పాపాలను మన్నించడమే. ప్రభువు కరుణామయుడు గాన మన పాపాలను క్షమిస్తూంటాడు. అలా క్షమాపణం పొందిన మనం ఆ ప్రభువు పట్ల కృతజ్ఞతాభావంతో మెలగాలి. ఆ ప్రభువు కారుణ్యాన్ని అర్ధం జేసికొని అతన్ని వేనోళ్ళ కొనియాడాలి. అంతేగాని ఆ సీమోను లాగ మన తప్పిదాలను మనం కప్పిపెట్టుకొని వేరేవాళ్ళను గూర్చి చెడుగా భావించడం పాడిగాదు.

8. ఇద్దరు కుమారులు - మత్త 21,28–32

1. వివరణం

తండ్రి తన కుమారులిద్దరినీ ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమన్నాడు. పెద్దవాడు మొదట నేను వెళ్ళనన్నాడు. కాని తర్వాత అతడు తండ్రి యాజ్ఞ విూరినందుకు పశ్చాత్తాపపడ్డాడు. తోటకు వెళ్ళి పనిచేసాడు. ఈ పెద్ద కమారుడు సుంకరులకూ జారిణులకూ పోలికగా వుంటాడు. వాళ్ళంతా మోషే ధర్మశాస్తాన్ని పాటించని పాపపమూక. అందుకే పరిసయులు వాళ్ళను అంతగా చిన్నచూపు చూస్తున్నారు. ఐనా వీళ్ళు స్నాపక యోహాను బోధలనూ క్రీస్తు బోధలనూ విని పశ్చాత్తాపపడుతున్నారు. ఈ పశ్చాత్తాపం వల్ల వీళ్ళు దేవునికి ప్రియపడ్డారు. దేవుడు వీళ్ళ పాపాలను క్షమించాడు. కనుక వీళ్ళ దైవరాజ్యంలో ప్రవేశిస్తారు.

ఇక రెండవ కుమారుడు మొదట నేను తోటకు వెత్తానన్నాడు కాని అతడు టక్కరివాడు. కనుక చివరికి వెళ్ళనే లేదు. యూదుల నాయకులయిన పరిసయులకూ ధర్మ శాస్తోపదేశకులకూ ఇతడు పోలికగా వుంటాడు. వీళు మోషే ధర్మశాస్రాన్ని పాటిస్తూన్నట్లు నటిస్తున్నారే గాని దైవాజ్ఞలను మిూరుతున్నారు. ఏవేవో బాహ్యాచారాల్లో