పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఈ సామెత నేర్పే మరో సత్యం, తోడి జనాన్ని చిన్నచూపు చూడకుండా వుండడం. ఆత్మస్తుతి పరనింద అనేది జనులందరిలోను కన్పించే దుర్గుణమే. మనకంటే మీదివాళ్ళు మనలను తూలనాడుతూంటే మనకంటె క్రింది వాళ్ళను మనం తూలనాడుతూంటాం. కాని కన్పూష్యస్ చెప్పినట్లు, మొదట మన యిల్ల శుభ్రం చేసికోందే ఎదుటి వాళ్ళ యింటి గడప అశుభ్రంగా వుందని వదరడందేనికి? కావున క్రైస్తవ భక్తుడు వినయమూ ఆత్మసంస్కారమూ మొదలైన సదుణాలు అలవర్చుకొనే ప్రయత్నం చేయాలి.

5. ద్రాక్షతోట యజమానుడు = మత్త 20, 1-16

1. సందర్భం

ఈ సామెతగూడ కారుణ్యపు సామెతల వర్గానికి చెందిందే. దీనిలో ప్రధానపాత్ర తోట యజమానుడు. అతడు దయగల కాపు. కొద్దికాలం పనిజేసిన కూలీలకుగూడ వాళ్ళ కుటుంబాలకు సరిపొయ్యేటంత కూలియిచ్చే మహానుభావుడు. ఇతడు పాపాత్ములపట్ల దయజూపే తండ్రికి ప్రతిబింబంగా వుంటాడు.

2. వివరణం

ద్రాక్షతోట యజమానుడు ఒకడున్నాడు. అతని తోటలు బాగా కాసాయి. కాయ కోతకు వచ్చింది. ఆలస్యం చేస్తే ఏ చెడివానో కురిసి పండిన పండ్లను నాశం చేయవచ్చు అంచేత శీఘంగా కాయలు గోయించడానికి కూలివాళ్ళ కోసం తిరుగుతున్నాడు. వేకువజాము నుండి పట్టణమంతా గాలించి ఉదయం ఆరింటికి ఓ కూలీల జట్టును తోటల్లోకి పంపాడు. మళ్ళా తొమ్మిదింటికి జట్టును పంపాడు. ఈ విధంగా ఆ రోజు నాల్లతడవల నాలు జట్టులను పంపాడు. ఐదవతూరిగూడ వీధుల్లోకి వెళ్ళిచూడగా అక్కడ సోమరి కూలీలు కొంతమంది కబుర్లు చెప్పకొంటూన్నారు. అప్పటికే సాయంకాలం ఐదుగంటలయింది. ఇక వాళ్ల పని చేయగలిగేది ఒక్క గంట మాత్రమే. ఐనా ఏదో తోచింది ఇస్తానని ఒప్పందం చేసికొని ఆ యైదవ జట్టునుగూడ తోటలకు పంపాడు.

ప్రాద్దు క్రుంకింది. కూలివాళ్ళకు ఏరోజు కూలి ఆరోజు చెల్లించాలి. ఆ కాపు ధనవంతుడు గనుక ఓ గృహనిర్వాహకుడు అతని యిల్ల చక్కబెడుతూండేవాడు. యజమానుని అనుమతిపై అతడు కూలీలకు జీతం చెల్లిస్తున్నాడు. అతడు మొదట చివరి జట్టవాళ్ళను బిలిచి ఒక్కొక్కరికి ఒక్కదీనారం చెల్లించాడు. దీనారమంటే ఆ రోజుల్లో ఒక కూలివానికి ఒకరోజు కూలికి చెల్లించే వేతనం. ఇప్పటి మన ధరల ప్రకారం ఇంచుమించు 50-60 రూపాయలు ఉండవచ్చు. సరే, అది చూచేటప్పటికల్లా మొదట వచ్చినవాళ్లకు పండ్లు పులిసాయి. వీళ్ళతో బోల్చుకుంటే వాళ్లు చాల గంటలు పనిజేసారు గనుక తమకు ఎక్కువకూలి గిడుతుందనుకొన్నారు. కాని గృహనిర్వాహకుడు వాళ్ళకు