పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవవంతు పన్నుచెల్లించాడు. ఎందుకు? ఆ మోసపు సేద్యగాళ్ళు పన్నుచెల్లించారో లేదో అన్న అనుమానంచేత. పొలంలో పండే పునాసపంట మీదానూ జంతువుల మందలమీదానూ మాత్రమే యూదులు దేవాలయపు పన్నుచెల్లించాలి. ఇతడోంటే, తాను తోటలో పండించుకొనే దుంపలూ కూరగాయలూ మొదలైన అల్ప వస్తువుల మీదగూడ పన్ను చెల్లించాడు. అతని మనస్సాక్షి అంత సున్నితమైంది మరి.

ఇక్కడ ఓ విషయం చక్కగా అర్థం జేసికోవాలి. ఉపవాసాన్ని గూర్చిగాని పన్ను చెల్లించడాన్ని గూర్చిగాని ఈ పరిసయుడు అబద్ధమేమీ చెప్పలేదు. అతడు చెప్పిందంతా నిజమే. మరి అతని తప్పేమిటి? నేనింతటివాణ్ణి అంతటివాడ్డి అనుకోవడం ఎవరికి జెల్లుతుంది? దేవుని యెదుట మన తప్పలను ఒప్పకొని మన్నింపు అడుగుకోవాలిగాని, నేను ఆ పుణ్యకార్యాలు చేసాను, ఈ పుణ్యకార్యాలు చేసాను అని గొప్పలు చెప్పకుంటే సరిపోతుందా? భగవంతుని కృపపై ఆధారపడాలిగాని మన పుణ్యకార్యాలమీదనే మనం ఆధారపడితే రక్షణం కలుగుతుందా? పైగా ఇతనిలాగా తోడి ప్రజలు పాపాత్ములు అనుకోవడం పాడియేనా? అహంభావమంటే యిదిగాదా?

ఈ యహంభావానికి పరిసయులు పెట్టింది పేరు. టాల్మడ్ అనే యూదుల ఆచార గ్రంథంలో రబ్బయి నెఖోనియాసు చేర్చిన జపమిది. యావే ప్రభూ! వీధుల్లో గూర్చొని సుద్దులతో కాలం వెళ్ళబుచ్చే గాలిజనంతో నన్ను జేర్చావు గావు. దేవాలయంలో గూర్చొని మోషే ధర్మ శాస్త్రాన్ని చదువుకొనే భాగ్యాన్ని నాకు ప్రసాదించావు. ఇందుకు నీకు వందనాలు చెప్తున్నాను. ఆ గాలిజనమూ నేను వేకువనే లేస్తున్నాం. ఐనా నేను టోరా గ్రంథాన్ని చదువుకోవడానికి : వాళ్ళ వ్యర్థంగా కాలం వెళ్ళబుచ్చడానికి. వాళ్ళూ నేనూ ప్రయాసలకు గురౌతున్నాం. ఐనా నేను శాశ్వతభాగ్యం పొందడానికి : వాళ్లొ నిరర్థకంగా రోజులు సాగించడానికి. వాళ్ళూ నేనూ పరుగెత్తుతూన్నాం. ఐనా నేను నిత్యజీవం లభించే మరో లోకంవైపు : వాళ్లొ నిత్యమృత్యువునకు కారణమైన గుంటవైపు. సిమ్యన్బెన్ జొక్క్తె అనే మరో రబ్బె ఈ క్రింది జపాన్ని చేర్చాడు. "ఈ ప్రపంచంలో ఇద్దరే యిద్దరు నీతిమంతులుంటే, వాళ్ళు నేనూ నా కుమారుడు మాత్రమే. ఒకే వొక్క నీతిమంతుడుంటే, అతడు నేను మాత్రమే!" ఈలాంటి భావాలతోగూడిన పరిసయుల మూకకు జెందిన నరుడొకడు దేవాలయంలో అడుగుపెట్టి పైరీతిగా ప్రార్థించాడనడంలో వింతేముంది?

ఇక, సుంకరి ప్రార్థనను పరిశీలిద్దాం. అతడు పీఠానికి దూరంగా నిలుచుండి అపాత్రుడనన్న భావంతో పరలోకం వైపు కండ్లెత్తి చూడ్డానికిగూడ జంకి గుండెలు బాదుకొంటూ "ప్రభూ! పాపిని, నాపై కృపజూపు" అని మాత్రం ప్రార్థించాడు. ఇక్కడ సుంకరి తన ప్రత్యేక పాపాలేమిటో తెలియజేయలేదు. అక్కరలేదు కూడ. ఏమంటే, ఇతని పాపాల జాబితానుగూడ పరిసయుడే వెల్లడిజేసాడు. ఆ పరిసయని వలె ఈ సుంకరి