పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ్ముళ్ళను అనాదరబుద్ధితో జూడరాదు. పైగా నీవు ఈ పాపాత్ములతో భుజించి వాళ్ళను ఆదరించడం దేనికని పరిసయులు క్రీస్తుని విమర్శించరాదు. ఎందుకంటే దయామయుడైన ఆ పరలోకపు తండ్రి ప్రతినిధి క్రీస్తు. ఆ తండ్రి పాపులపట్ల తనకుగల దయను ఈ క్రీస్తు ద్వారా ప్రదర్శిస్తున్నాడు. కావున క్రీస్తుని దయాభావాన్ని విమర్శించడమంటే పరలోకపు తండ్రి దయాగుణాన్ని విమర్శించడమే.

ఈ సామెతలోని ప్రధాన భావం ఆ తండ్రి కరుణ.కావుననే దీన్ని "కరుణాళువైన తండ్రి సామెత" అని పిలవాలని చెప్పాం. చిన్న కుమారుని ఆగడమూ, పరితాపమూ, పెద్ద కుమారుని యిూసూ - ఇవన్నీ ఆ తండ్రి జాలిని వ్యక్తం జేయడానికి కల్పింపబడిన సన్నివేశాలు మాత్రమే.

3. అన్వయం

1. ఈ సామెతలో చిన్నవాని తప్ప ఆస్తిని దూబరాగా ఖర్చు చేయడంగాదు, ప్రేమమయుడైన తండ్రిని ధిక్కరించి అతని యింటినుండి వెళ్ళిపోవడం. బైబుల్లో పాపమంటే సృష్టికర్తయైన దేవుని సన్నిధినుండి వెళ్ళిపోవడం. సృష్టి వస్తువులు మనలనేమో సుఖపెడతాయని వాటి దగ్గరకు వెళ్ళడం. దుడుకు చిన్నవాడు చేసింది అచ్చంగాయిదే. ఇక, పశ్చాత్తాపమంటే ఆ సృష్టి వస్తువులను విడనాడి మళ్ళా తండ్రివంటివాడైన సృష్టికర్త యింటికి తిరిగిరావడం. ఆ తండ్రిని మన్నింపు అడుగుకొని మళ్లా అతని ప్రేమకు పాత్రుడు కావడం, చిన్నకుమారుడు తిరిగి రావడంలో భావం యిదే. కనుక ఈ సామెత మన జీవితంలో గూడ నిజమైన పశ్చాత్తాపానికి మార్గదర్శకంగా వుంటుంది. దేవుని కారుణ్యాన్ని అతడు పంపిన క్రీస్తు దయాగుణాన్నిధ్యానం చేసికోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

2. ఈ సామెతలో పెద్దకొడుకు చిన్నవాణ్ణి చిన్నచూపు చూచాడు. అలాగే పరిసయులూ ధర్మశాస్తోపదేశకులూ సుంకరులనూ పాపాత్ములనూ చిన్నచూపు చూచారు. మనంగూడ ఈలాగే చేస్తుంటాం. తరచుగా మనం పుణ్యాత్ములమనీ ఇతరులు పాపాత్ములనీ భావిస్తూంటాం. ఈ భావంతోనే తోడి జనాన్ని ఆడిపోసుకొంటూంటాం. కాని ఇది పెద్ద పొరపాటు. ఇతరులను తృణీకరించడమనేది డాంబికులైన పరిసయుల దృష్టి భగవంతుని దృష్టి, అతని పుత్రుడైన క్రీస్తు దృష్టి అదికాదు. ఆ తండ్రీకొడుకులు కరుణామయులు. క్రైస్తవులమైన మనం తోడి జనుల కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపడానికి సిద్ధంగా వుండగూడదు.

4. పరిసయుడూ, సుంకరీ - లూకా 18, 9-14

1. సందర్భం

లూకా మాత్రమే ఈ సామెతను ఉదాహరించాడు. పరిసయులు మోషే ధర్మశాస్తాన్ని తుచ తప్పకుండ పాటించేవాళ్లు, ధర్మశాస్తాన్ని పాటిస్తే పుణ్యకార్యాలు చేసి