పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. యావే - యిప్రాయేలు దాంపత్య గాథ తొలిదశలో యిస్రాయేలు కన్య వధువు అన్నాం. ఆ వధువును ప్రభువు ఉత్కటంగా ప్రేమించాడన్నాం. కాని రెండవ దశలో యిప్రాయేలు వ్యభిచారిణి. అనగా యీ దశలో ప్రజలు యావేను విడనాడి పరదేవరులను కొలవడం మొదలెట్టారు. ఎన్మిదవ శతాబ్దిలో సోలోమోను పాలనం క్రింద పాలస్తీనా దేశం సమస్త సిరిసంపదలతో తులదూగింది. యూదులకు మదం దిగింది, వాళ్ళు యావేను విడనాడి కనానీయుల దైవమైన బాలును ఆరాధించటం మొదలెట్టారు. కనుకనే హోషేయా ప్రవక్త"జనులు యావేను విడనాడి సర్వత్ర వ్యభిచరిస్తున్నారు" అంటాడు -2, 2. పాలస్తీనా దేశం అప్పటికే యూదా, సమరయ అని రెండు రాష్ట్రాలుగా చీలిపోయింది. ఈ రెండు రాష్ట్రాలు ఇద్దరు అక్కచెల్లెళ్లు అన్నాడు యెహెజ్కేలు ప్రవక్త. ఈ యక్కచెల్లెళ్లిద్దరూ ప్రభువును విడనాడి వ్యభిచారానికి పూనుకున్నారు - యెహె 23. ప్రభువు ఈ యిస్రాయేలు వధువుపై కోపంపూని ఆమెను నిశితంగా శిక్షించాడు. "మీరు నా ప్రజలు కాదు, నేను మీ దేవుడను కాను" అని యిస్రాయేలీయులను విడనాడాడు - హోషే 1,9. వాళ్లను బాబిలోను ప్రవాసానికి పంపించాడు. కాని, ప్రభువు చూపిన యీ కోపం మళ్లా వధువును తన చెంతకు రాబట్టుకోవడానికే.

18. దాంపత్య గాథ తొలిదశలో యిస్రాయేలు వధువు కన్య అన్నాం. రెండవదశలో వ్యభిచారిణి అన్నాం. మూడవ దశలో ఆమె క్షమింపబడిన వధువు ఔతుంది. పాపఫలితంగా బాబిలోను ప్రవాసానికి వెళ్లిపోయిన వధువును ప్రభువు మళ్లాపిలిపిస్తాడు యావే హోషేయా ప్రవక్తముఖాన "ఆమెను ఆకర్షించి యెడారికి కొనిపోతాను. అక్కడ ఆమెకు ప్రియంగలిగేలా మాటలాడతాను" అంటాడు - 2,14. ప్రభువు తన వధువును ఎడారికి గొనివస్తాడు. అక్కడ ఏకాంతంగా ఆమెతో సంభాషిస్తాడు. ఆమె హృదయాన్ని మారుస్తాడు. ఆమె ప్రేమను చూరగొంటాడు. అనగా ప్రభువు అనురాగంతో తన ప్రజలను బాబిలోను నుండి ఎడారిగుండ నడిపించుకొనివచ్చి మళ్లా వాగ్టత్త భూమిలో స్థిరపరుస్తాడని ప్రవక్తభావం. ఇలా తిరిగివచ్చిన వధువుతో ప్రభువు మళ్లా ఓ క్రొత్త వొడంబడిక చేసికుంటాడు "నేను నిన్ను ఆదరంతో ప్రధానం జేసికుంటాను. అప్పుడు నీవు యావేనైన నన్ను తెలిసికుంటావు" అంటాడు — హోషే 2, 22.

19. ప్రభువు వ్యభిచారిణియైన తన వధువును క్షమించి ఆమెతో మళ్లా క్రొత్త వొడంబడిక చేసికుంటాడనే భావాన్నియెషయ ప్రవక్తచాల లలితంగా వర్ణించాడు. "పరిత్యక్త దుఃఖాక్రాంతురాలు ఐన భార్యను భర్తలాగే యావే తన వధువును మళ్లా రప్పించుకుంటాడు తాను యువకుడుగా వున్నపుడు పెండ్లియాడిన భార్యను - ఆమెయెంత ద్రోహముచేసిన - పురుషుడు విడనాడదు. ఆలాగే యావేకూడ తన వధువును - ఆమె అవివేకంతో