పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. కారుణ్యపు సామెతలు

క్రీస్తు సామెతలను కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. "కారుణ్యపు సామెతలు" ఓ ప్రత్యేక వర్గం. ఈ వర్గంలో ఇంచుమించు పది సామెతలుదాకా వున్నాయి. తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు, పరిసయుడు సుంకరి, ద్రాక్షతోట యజమానుడు, క్షమింపనొల్లని సేవకుడు, ఇద్దరు బాకీదారులు, ఇద్దరు కుమారులు మొదలైన సామెతలన్నీ ఈ కోవకు జెందినవే. పరలోకపు తండ్రి పాపాత్ముల యెడల కరుణ జూపుతాడు అనేది వీటిల్లోని ప్రధానాంశం. ఇక, యీ శాఖకు జెందిన సామెతలను క్రమంగా పరిశీలించి చూద్దాం.

1. తప్పిపోయిన గొర్రె

- లూకా 15, 1-7 (మత్త 18, 11-14)

1. సామెత సందర్భం

యూదుల్లో ఒక తెగవాళ్ళ సుంకరులు. వీళ్ళు పాలస్తీనా దేశంనుండి పన్నులు వసూలుజేసి రోమను ప్రభుత్వానికి అప్పజెప్పేవాళ్ళ కాని వీళ్ళ లోభబుద్ధితో మితంమీరిన పన్నులు వసూలుజేసి కొంత సొమ్ముతాము కొట్టేసి మిగిలిన సొమ్ము రోమను ప్రభుత్వానికి ముట్టజెప్పేవాళ్లు, అందువల్ల ఈ వర్గం వాళ్ళంటే మిగతా యూదులు కొరకొరలాడేవాళ్లు, ఇంకా, పాలస్తీనా దేశంలో గొర్రెలనూ గాడిదలనూ మేపేవాళ్ళూ, చర్మకారులూ, అంగడిదారులూ మొదలైనవాళ్ళంతా పై సుంకరులతో సమానంగానే లెక్కగట్టబడ్డారు. వీళ్ళందరికీ కలిపి "పాపాత్ములు" అని పేరు. ఎందుకంటే వీళ్ళ మోషే ధర్మశాస్తాన్ని పాటించేవాళ్ళ కాదు. మోసానికీ దగాకోరుతనానికీ పూనుకొనేవాళ్లు అందుచే యూద సమాజంలో అగ్రవర్గానికి చెందిన పరిసయులూ, ధర్మశాస్త్ర బోధకులూ ఈ పాపాత్ములను చిన్నచూపు చూచేవాళ్లు.మోషే ధర్మశాస్తాన్ని బోధించడానికిగూడ వీళ్ళదగ్గరికి వెళ్ళగూడదని పై శిష్ణుల భావం. ప్రభు నిబంధనలను పాటించని దుర్మార్డులు నాశమైపోతే ఆ ప్రభువు సంతోషిస్తాడని వాళ్ళ బోధ. కాని భగవంతుని హృదయం అదికాదు. ఈలాంటి సంకుచిత భావాలతో నిండిన యూద నాయకులకు క్రీస్తు చర్యలు విడట్టారంగా కన్పించాయి. క్రీస్తు సుంకరుల కోపు దీసికొన్నాడు. పాపాత్ములనబడేవాళ్ళ యిండ్లల్లో భోజనం చేస్తున్నాడు. ఇది యూదనాయకులకు ససేమి గిట్టలేదు. వాళ్ళు “ఇతగాడు పాపాత్ములతో భోజనం చేయడం దేనికని క్రీస్తుమీద గొణిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని క్రీస్తు చెప్పినవే తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు అనే సామెతలు. ఈ మూడు గూడ భగవంతుడు పాపాత్ముల పట్ల కరుణ జూపుతాడు అనే సత్యాన్ని బోధిస్తాయి. 152