పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాజం విశేషంగా బడుగువర్గాలవారిని ఆదుకోవడానికి ఉద్దేశింపబడింది. దానిలో పంచుకోవడం, సేవచేయడం, జాతి లింగ వివక్ష చూపకపోవడం అనే గుణాలున్నాయి. క్రీస్తు స్థాపించిన నవసమాజమే దైవరాజ్యం. ఆనాటి పాలస్తీనా దేశంలోని పేదవర్గాలన్నీ దానిలో చేరాయి. వాళ్లు ఇప్పటి మన దేశంలోని దళితులు, ఆదివాసీలు, గిరిజనులు మొదలైన వాళ్లకు సమానం. ధనికులు, అగ్రవర్గాలు, అధికారవర్గాలు మాత్రం దానిలో చేరలేదు. వాళ్లు హెరోదు, కైసరు, సైతాను సమాజానికి చెందినవాళ్లు.

17. నవసమాజ లక్షణాలు

క్రీస్తు స్థాపించిన నవసమాజ లక్షణాలు ప్రేమ, న్యాయం, శాంతి మొదలైనవి. వారికి తిండి, స్వేచ్ఛ, సహవాసం లభిస్తాయి. అందరికీ సౌభ్రాత్రం వుంటుంది. స్త్రీలకు గౌరవం, పిల్లలకు భద్రత లభిస్తాయి. దాని ప్రణాళికను క్రీస్తు నజరేతులోనే విశదం చేసాడు, అది పేదలకు సువార్తను బోధించే రూపంలో వుంటుంది — లూకా 4, 18. అది బడుగు వర్గాల వారికి కరుణ జూపుతుంది.ధనికులను అగ్రవర్గాలవారిని పేదలను ఆహ్వానింపమని హెచ్చరిస్తుంది. ఈ సమాజం నైతిక సూత్రాలు ముఖ్యంగా మూడు. అవి 1 స్వేచ్చ, 2 సహవాసం, 8 న్యాయం. మొదటిది, స్వేచ్చ క్రీస్తు ప్రజలను పాపదాస్యం నుండి విడిపించాడు. పిశాచ శక్తులనుండీ, సంఘ బహిష్కారం నుండీ విడిపించాడు. ధర్మశాస్త్రం కట్టుబాట్ల నుండీ, కర్మకాండ నియమాలనుండీ విడిపించాడు. రెండవది, సహవాసం. ఇక్కడ ఉన్నవాళ్లు లేనివాళ్లతో పంచుకోవాలి. క్రీస్తు పేదలను ఆదుకొమ్మన్నాడు. పేదసాదలను పట్టించుకొంటే దేవుణ్ణి పట్టించుకొన్నట్లు అని చెప్పాడు. నేను మిమ్మ ప్రేమించినట్లే మీరూ ఒకరి నొకరు ప్రేమించండి అన్నాడు - యోహా 13, 34. అక్కరలో వున్నవారిని ఆదుకొంటే తన్ను ఆదుకొన్నట్లేనని చెపూ తుది తీర్పు సామెతను బోధించాడు - మత్త 25,40. మూడవది న్యాయం. క్రీస్తు దేవాలయంలో జరిగే అన్యాయాలను, సమాజంలో ధనికులు పేదలకు చేసే అన్యాయాలను ఎదిరించాడు, పిశాచశక్తికి ఎదురు నిల్చి బలవంతుణ్ణి జయించిన బలవంతుడు అయ్యాడు - మార్కు 3,27. 18. దళితోద్యమం భవిష్యత్తు క్రీస్తు దళిత విమోచనోద్యమానికి సిలువ గురుతుగా వుంటుంది. అది విప్లవ చిహ్నం. పోరాటానికి గురుతు. మనిషిలో మార్పు రావాలనడానికి సంకేతం. నేడు దళితులు దానినుండి ప్రేరణం పొందాలి.