పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుకి ముఖ్యమైన విలువలు న్యాయం, కరుణ, ప్రేమ, సేవ మొదలైనవి. కనుక అతడు డాంబికులైన పరిసయులను నిశితంగా దూయబట్టాడు. వాళ్లు సున్నంగొట్టిన సమాధుల్లాంటివాళ్లన్నాడు — మత్త 23. అతడు పేదసాదలను రోగులను ఆదరించవలసివచ్చినపుడు విశ్రాంతి దిన నియమాలను ఖాతరు చేయలేదు. విశ్రాంతి దినం నరుని కొరకు వుందిగాని నరుడు విశ్రాంతిదినం కొరకు లేడని పల్మాడు - మార్కు 2, 27. ఇది యూదమతం మీద పెద్ద తిరుగుబాటు. సనాతన వాదులకు చెప్పదెబ్బ. ఇంకా అతడు దేవుడు కోరేది కరుణ న్యాయాలుగాని జంతుబలులు కాదన్నాడు - మత్త 9,13. ఇది దళితులను దోపిడి చేస్తున్న యాజకులకు చెంపదెబ్బ, మంచి సమరయుని కథలో అతడు యాజకులు లేవీయులు పేదలను పట్టించుకోరని రుజువు చేసాడు. యూదుల పలుకుబడి, శక్తి అధికారం వాళ్ల దేవాలయంలో కేంద్రీకృతమై యుంది, సదూకయులు దానిలో బలిపశువులనమ్మి లాభాలు పొందుతున్నారు. నాణాలుమార్చే వ్యాపారులు పేదలను కొల్లగొడుతున్నారు. అన్యజాతివారికి దానిలో ప్రవేశంలేదు. పూర్వం మనదేశంలో గూడ దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. కనుక క్రీస్తు దేవాలయ వ్యవస్థను దుయ్యబట్టాడు. "నా ఆలయం అన్ని జాతులకు ప్రార్ధనాలయం" అన్నాడు - మార్కు 11, 17. మన దేశంలో దేవాలయ ప్రవేశానికి దళితులు చేసిన ఆందోళనకు క్రీస్తు ప్రాతిపదికగా వుంటాడు. క్రీస్తు యెరూషలేము దేవాలయం వల్ల రక్షణం కలుగదన్నాడు. పేదసాదలను బడుగువర్గాలను ఆదుకోవడంవల్ల ముక్తి కలుగుతుందన్నాడు. వారికి చేసిన సేవ తనకు చేసినట్లేనన్నాడు. ఇదే తుది తీర్పు సామెత సందేశం - మత్త 25, 31-46. కనుక దేవాలయారాధనలో జంతుబలులు ముఖ్యంకాడు. హీనులనూ దీనులనూ ఆదుకోవడమే ముక్తికి మార్గం.

6. దళితుల కొరకు నవసమాజ స్థాపనం

16. నవసమాజ సభ్యులు

క్రీస్తు దళితుల కొరకు నవసమాజాన్ని ఏర్పాటు చేసాడు. సమానత, స్వేచ్చ పంచుకోవడం, సేవ మొదలైనవి ఈ నూత్న సమాజ లక్షణాలు, క్రీస్తుకి ముందే యూదుల్లో విప్లవవాదులు, ఎస్సీనులు, పరిసయులు మొదలైనవాళ్లు తమసమాజాలను ఏర్పాటు చేసికొన్నారు. కాని క్రీస్తు సమాజానికి లభించిన విజయం వాటికి లభించలేదు. అతని