పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్కృతిని ఛేదించాడు. మీకు అన్యాయాలు, అపకారాలు, మానభంగాలు జరిగినప్పడు మీరు కూడ గొంతెత్తి ప్రతిఘటించండని ప్రోత్సాహించించాడు. క్రీస్తు హెచ్చరించి ప్రోత్సహించిందాకా ఆ దళితులకు ప్రతిఘటనం తెలియదు. క్రీస్తు నెలకొల్పిన సమసమాజంలో సమానత్వం, సమకారం, సౌభాత్రం, స్వేచ్చ ప్రేమ, సేవ గొప్ప విలువలు. యూదులకూ అన్యజాతివారికీ మధ్య యాజకులకూ గృహస్తులకూ మధ్య,స్త్రీ పురుషుల మధ్య యజమానులకూ సేవకులకు మధ్య అంతరాలు గతించాయి - గల 3, 28. దళితులకు అతడు చేసిన ఉపకారం అది. మనదేశంలో లాగే యూదసమాజంలో గూడ స్త్రీలకు స్థానంలేదు. వాళ్లు దళితుల్లో దళితులు. భూమి, పశువులు, బానిసలు యజమానుని ఆస్తులు. స్త్రీ కూడ ఈ యాస్తిలో ఓ భాగం. అనగా ఆమె వస్తువుకాని వ్యక్తికాదు - నిర్ణ 20,17. వారికి ఆస్తిహక్కులేదు. భర్తలు వారి కెప్పడైనా విడాకులు ఈయవచ్చు. వాళ్లు ఇంటిలో పడివుండాలేగాని సమాజంలో పదిమంది ముందుకి రాకూడదు. సమావేశాల్లో మాట్లాడకూడదు. కాని క్రీస్తు స్త్రీలను బంధించివుంచే దాస్య శృంఖలలను బ్రెంచివేసాడు. తన శిష్యుల్లో మహిళలను కూడ చేర్చుకొన్నాడు. వాళ్లకు పురుషులతో సమానమైన గౌరవం విలువ యిచ్చాడు. ధర్మశాస్త్ర నియమాలను మీరి వాళ్లను తాకాడు, వాళూ అతన్ని స్పృశించారు.

అతడు కననీయ స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు. దేవళంలో దానం చేసిన పేదరాలిని పొగడాడు. తనకు అభిషేకం చేసిన మహిళ కోపు తీసికొన్నాడు. సమరయస్త్రీ, మగ్గల మరియు అతనితో కలసి పనిచేసారు. తన రాజ్యంలో స్త్రీలకు కూడ పురుషులతో సమానమైన స్థానం కల్పించాడు. ఇంకా అతడు స్త్రీలతోపాటు చిన్నబిడ్డలకు కూడ యూద సమాజంలో స్థానం కల్పించాడు. అతడు వచ్చేవరకు యూదసమాజంలో పసిబిడ్డలు అనామకులు - 10, 13-16.

15. ధర్మశాస్త్రం, దేవాలయం

మతం, యాజకత్వం, దేవాలయం, పవిత్ర గ్రంథాలు, ధర్మశాస్త్రం అగ్రవర్గాల వారిని సమర్ధించి దళితులను అణచివేస్తాయి. పాలస్తీనా దేశంలోను ఇండియాలోను కూడ ఇదే జరిగింది. పాలస్తీనాలో క్రీస్తు, మన దేశంలో అంబేద్కర్ పైవాటికి ఎదురు తిరిగారు. క్రీస్తు మోషేధర్మశాస్త్రంలో మార్పులు చేసాడు. మోషే తోడి నరుని హత్య చేయవద్దన్నాడు. నేనైతే తోడి నరుడ్డి కోపించడం గూడ పనికిరాదని చెప్తున్నాను అన్నాడు — మత్త 5,21-22, ధర్మశాస్త్రాన్ని పేదసాదలకు అనుకూలంగా వుండేలా మార్చాడు. మనుధర్మశాస్త్రం పేదలను అణచివేస్తుంది కనుక అంబేద్కర్ దాన్ని నడివీధిలో తగలబెట్టాడు.