పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరుకొన్నాడు. తన శిష్యుల్లో సమతామమతా భావాలు వేళూనాలని ఆశించాడు. ఇప్పడు కూడ అతడు మనతో కలసి భుజిస్తుంటాడు. మనమందరం ఏకపంక్తిలో అతనితో కలసి భుజించాలి - దర్శ 3,20.

4. దళితులకు అనుకూలమైన బోధలు

10. శుద్ధిని గూర్చిన నూత్నభావాలు

ఆరోజుల్లో పరిసయులు, ఎస్సీనులూ వాళ్ల ముఠావాళ్లతో కలసి భుజించేవాళ్లు, వేరే వాళ్లను ఆ భోజనానికి రానివచ్చేవాళ్లు కాదు. తాము శుద్దులమనీ ఇతరులు కాదనీ వాళ్ల ఉద్దేశం. ఈలాంటి పరిస్థితుల్లో క్రీస్తు సుంకరులతోను పాపలతోను కలసి భుజించడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. క్రీస్తు దేవుని పావిత్ర్యం ప్రధానంగా అతని కరుణలో వుందను కొన్నాడు – లూకా 6,36, యూదులు దేవుని పావిత్ర్యం ప్రధానంగా అతడు ప్రపంచానికి దూరంగా వుండడంలో వుందనుకున్నారు. క్రీస్తు దృష్టిలో మతమంటే శారీరక శుద్దీకాదు, కర్మకాండాకాదు. ఒకరిపట్ల ఒకరు దయజూపడమే మతం. కాని యూదులభావాలు ఇవి కావు. అందుకే వారికీ అతనికీ తరచుగా ఘర్షణలు వస్తుండేవి. యూదులు పావిత్ర్యానికి మూడు నియమాలు పెట్టారు. దేవాలయంలో వాడగలిగితే, అబ్రాహాము నెత్తురు కలిగివుండి అతని సంతానమైతే, దేహంలో అన్ని అవయవాలు సంపూర్ణంగా వుంటే ఆ వ్యక్తులు పవిత్రులు. వస్తువులకూ స్థలాలకూ కూడ ఈ నియమాలే వర్తిస్తాయి. మన దేశంలో మనుస్మృతి కూడ ఈలాంటి నియమాలే చేసింది. కాని క్రీస్తు ఈ నియమాలు చెల్లవన్నాడు. అతని దృష్టిలో పవిత్రతా లక్షణాలు కరుణ, ప్రేమ, న్యాయం, నిర్మలమైన ఉద్దేశం మొదలైనవి. తన భావాలను విశదం చేయడానికి అతడు పాపలతో కలసి భుజించాడు, కాళ్లచేతులు కడుగుకోకుండానే భోజనం చేసాడు. కుష్టరోగిని చేతితో తాకాడు, - మార్కు 1,41. శరీర శుద్ధిలేని స్త్రీని తన్ను తాకనిచ్చాడు - మార్కు 5,28. ఏ భోజనమైనా శుద్ధిగలదేనని వచించాడు- మార్కు7, 19. లోనికిపోయే ఆహారంగాదు, నరుల హృదయంనుండి బయటికి వచ్చే ఆలోచనలు వారిని మలినపరుస్తాయి అన్నాడు - మార్కు 7, 15 దుష్టవాంఛలు, వివక్ష, ఇతరులను చిన్నచూపుచూడ్డం మొదలైనవి మనలను అశుద్దులను చేస్తాయి. పరిసయుడు సుంకరి • కథలో సుంకరి దళితుడు, పరిసయుడు బ్రాహ్మణుడు. నిజమైన శుద్ధి సుంకరికుందిగాని పరిసయునికి లేదు.