పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు పేద కుటుంబంలో పుట్టాడు. దేవాలయార్పణ సమయంలో అతని తల్లిదండ్రులు గొర్రెపిల్లనుగాక రెండు పావురాళ్లను కానుకగా అర్పించారు - లూకా 2,24. అతడు జీవితాంతం సంచార బోధకుడుగా, బికారిగా జీవించాడు. అతనికి యిలల్లా వాకిలీ తలవాల్చుకొనే తావూలేదు. పన్నులు చెల్లించడానికి కూడా డబ్బులేదు. చనిపోయిందాక ఒకే వస్తాన్ని తొడుగు కొన్నాడు - మార్కు 15, 24. దళితవర్గాలు జీవాన్ని సమృద్ధిగా పొందాలని అతని కోరిక - యోహా 10,10. అతని బోధనకాలంలో స్నేహితులు శిష్యులు అతన్ని పోషించారు. అతడు పట్టినప్పడు సొంతయింటిలోగాక పసులగాటిలో పుట్టాడు. చనిపోయినప్పడు అన్యుల సమాధిలో పాతిపెట్టారు. నాది అనేది యేదీ అతనికి లేదు. బడుగు వర్గాలను కోరుకొని, ఎన్నుకొని నూటికి నూరుపాళ్లు వాళ్లతో కలసిపోయినవాడు ఆ ప్రభువు.

9. దళితులతో పంక్తి భోజనం

ప్రభువు లేవీ యింట సమాజ బహిష్కృతులతో కలసి భోజనం చేసాడు - మత్త 9,10. ఈ చర్యకు పరిసయులు ఆగ్రహం చెందారు. ఎందుకు? కాళ్ల భావాల ప్రకారం మనం ఎవ్వరితో కలసి భుజిస్తామో వాళ్లలాంటివాళ్ల మౌతాం. సుంకరులు ధర్మశాస్తాన్ని పాటించని పాపపు మూక. కనుక వాళ్లతో కలసి భుజించే క్రీస్తుకూడ పాపిఐ యుండాలి. కనుక వాళ్లు క్రీస్తుని తప్పపట్టారు. ఈ సందర్భంలోనే ప్రభువు తప్పిపోయిన గొర్రె, నాణెం, కుమారుడు అనే మూడు సామెతలు చెప్పాడు. ఈ మూడు కథలు అట్టడుగువర్గంవారి పట్ల దేవుడు కరుణ జూపుతాడు అనే సత్యాన్ని బోధిస్తాయి. ఇంకా అతడు సుంకరులు జారిణులు పరిసయులకంటె ముందుగా దైవరాజ్యంలో చేరతారని చెప్పాడు. — మత్త 21, 31. క్రీస్తు పాపులతో కలసి పంక్తిభోజనం చేసాడు. నేనూ మీరు సరిసమానమన్నాడు. నేటికీ మన దేశంలో అగ్రకులాలవాళ్లు దళితులతో కలసి భోజనం చేయరు. క్రీస్తు ప్రారంభించిన పంక్తి భోజనం ఆనాటి సమాజంలో పెద్ద విప్లవం తెచ్చి పెట్టింది. నూత్న సంస్కృతికి బాటలు వేసింది. నేడు మన పూజలోని దివ్యసత్రసాద స్వీకరణం గూడ ఈలాంటిదే. కాని మనం దివ్యసత్రసాదంలోని సోదర ప్రేమను గుర్తించం - 1 కొరి 10,17. ఒకే రొట్టెలో పాలుపంచుకొన్నవాళ్లు ఒకే శరీరం, ఒకేసమాజం ఔతారని గ్రహించం. క్రీస్తు ఒక్కసారిగాదు, నిరంతరం అట్టడుగువర్గం వారితో కలసి భుజించాడు. తాను వారిలో ఒకడై పోయాడు. తన శిష్యులు కూడ తనలాగే పంక్తి భోజనం చేయాలని