పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

- మత్త 9,36. పూర్వం మోషే తన తరువాత మందను కాపాడే కాపరి ఈలా కరుణామయుడై వుండాలనే ప్రభువును ప్రార్ధించాడు - సంఖ్యా 27, 17. 9. జెకర్యా "గొర్రెలకాపరిని కొట్టండి, మంద చెల్లాచెదరౌతుంది" అని యోగ్యడైన కాపరిని గూర్చి ప్రవచనం చెప్పాడు - 13,7. యెషయా 'యావేమన దోషాలన్నీ అతనిమీద మోపాడు” అని బాధామయ సేవకుడ్డిగూర్చి ప్రవచనం జెప్పాడు – 58, 6. ఈ ప్రవచనాల కనుగుణంగానే క్రీస్తును సిలువపై కొట్టి చంపారు. ప్రభువు మందకోసం చనిపోయాడు. కాని మందకోసం అసువులు పాయడంవల్లనే అతడు “గొర్రెల గొప్పకాపరి" కాగలిగాడు - హెబై 13,20. మనమంతా గొర్రెల్లాగ త్రోవదప్పిపోయాం. కాని ప్రభువు సిలువపై మరణించాక "కాపరి ఆత్మల రక్షకుడు" నైన ఆ క్రీస్తువైపు మళ్లాం - 1 పేత్రు 2, 25, ఆ ప్రభువువలన పాపపరిహారం పొందాం. 10. చివరిదైన ప్రకటన గ్రంథం క్రీస్తును మోక్షంలో ఓ కాపరిలా చిత్రిస్తుంది. అతడు పుణ్యాత్ముల నందరను జీవజలాల యొద్దకు నడిపించుకొని వెళ్లాడు. అనగా వాళ్లకు సర్వసౌఖ్యాలూ చేకూరుతాయని భావం. దేవుడు ఆ పుణ్మాత్ముల నేత్రాలనుండి కన్నీటి బొట్లను తుడిచివేస్తాడు. అనగా వాళ్లకిక బాధలూ, శ్రమలూ వుండవని భావం7, 17 ఈలా క్రీస్తు భూమిమీదను మోక్షంలోను కాపరిలాగే వ్యవహరిస్తాడు. 11. యెహెజ్నేలు తన ప్రవచనం 34వ అధ్యాయంలో యిప్రాయేలు కాపరులను వర్ణించాడు. ఈ యధ్యాయాన్ని ఆధారంగా తీసికొని యోహాను తన సువార్త 10వ అధ్యాయంలో నూత్న వేదపు కాపరిని వర్ణించుకుంటూ పోయాడు. కాపరిని గూర్చిన తొలి మూడు సువార్తల్లోని భావాలకంటె ఇతని భావాలు విలక్షణంగా వుంటాయి. అంచేత వీటిని ప్రత్యేకంగా విచారించి చూడాలి. క్రీస్తు గొర్రెలను గాసే మంచికాపరి - 10, 11. పూర్వం యావే పేరుమీదుగా ప్రజలను పాలించిన దుష్టరాజులు, నాయకులు చెడ్డ కాపరులు. వాళ్ళ ప్రజలను పీడించారు. ఆలా కాకుండ క్రీస్తు ప్రజలకు మేలు చేస్తాడు. గొర్రెలు పచ్చిక బయళ్లకు వెళ్ళాలంటే ద్వారం క్రీస్తే – 10, 7. దేవునికి నరునికి మధ్య మధ్యవర్తి అతడే. అతని ద్వారాగాని మనం జీవం పొందం. గొర్రెలను బయళ్లకు తోలుకొని పోయేది క్రీస్తే - 10,4. ఈ కాపరికి తన గొర్రెలపేర్లు తెలుసు - 10, 3. అతడు పేరుపెట్టి పిలిస్తేచాలు. వెంటనే గొర్రెలన్నీ అతన్ననుసరిస్తాయి. క్రీస్తు గొర్రెలకోసం తన ప్రాణాన్ని బలిగా సమర్పిస్తాడు10,17. అదీ, జకర్యాప్రవక్త సూచించినట్లుగా ఎవరో బలవంతంగా చంపడంగాదు. తనంతట తానే ప్రభువు ప్రాణాలను ధారపోస్తాడు -10, 18 గొర్రెల చెదరిపోకూడదనీ, ఒకే మందగా వుండాలనీ, వాటిని ఒకే కాపరి మేపుతుండాలనీ ఈ ప్రభువు కోరిక