పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదన్నారు. ప్రజలను అపమార్గం పట్టించే మోసగాడు, పాపి, దేవ దూషకుడు అన్నారు. ఆనాటి అగ్రవర్గాలవాళ్లు నేటి దళితులను వలె అతన్ని అన్నివిధాల అణచివేయజూచారు. అతన్ని ద్రాక్షతోటనుండి, నగరం నుండి, నెట్టివేసారు. దళితుల్లాగే అతడు వెలివాడలో వుండిపోయాడు, అస్పృస్యడుగా ధనికుల నిరాదరణకు గురై కడన ఆ వెలివాడలోనే అసువులు పాసాడు. నగరద్వారం వెలుపల మరణించాడు - హెబ్రే 13, 12. కాని తాను చిందించిన నెత్తురు ద్వారానే అతడు ప్రజలను పాపం నుండి శుద్ధి చేసాడు. దేవాలయంనుండి, నగరద్వారం నుండి నెట్టివేయబడిన క్రీస్తు వెలివాడలో, మాలపల్లిలో అందరు దళితుల్లాగే కన్నుమూసాడు. అది మృతపశు కళేబరాలు శవాలు పడివుండే తావు. అది పంచముల నివాసస్థలం. అక్కడ అతన్ని బలిపశువునిగా వధించారు.

6. జాలిగొలిపే దళితుని మరణం

యూదమతాధికారులు క్రీస్తుని వెలివేసారు. అతని అద్భుతాలవల్ల లాభం పొందిన వాళ్లు అతన్ని నిరాకరించారు. ఇతని శరీరాన్ని మనమేలా భుజిస్తామని శిష్యులు అతన్ని వదలివెళ్లి పోయారు. ఒక శిష్యుడు అతన్ని పట్టియిచ్చాడు. మరొకడు నేనతన్నియెరగనే యెరగనన్నాడు. యూదుల దేవాలయము రోమను సామ్రాజ్యమూ అతన్ని ద్రోహినిగా నిర్ణయించాయి. క్రీస్తు సిలువనెక్కి మంటికీ మింటికీ మధ్య వ్రేలాడాడు. అతడు ఎవరికీ అక్కరబట్టలేదు. ఎవరికీ చెందివుండలేదు. అపవిత్రస్థలంలో, శవాల మధ్య సిలువపై వ్రేలాడాడు.

అతనికి తండ్రిగూడ తన్ను చేయివిడిచాడనిపించింది. దళితులకు లాగే తనకు కూడ దేవుని ప్రేమ, ఆదరణ, న్యాయం, సాన్నిధ్యం లభించవనిపించింది. හීඨිහිළුටක්ට්පී కలిగే బాధయిదే, ఆ బాధను భరింపలేక అతడు వాయెత్తి నా దేవా! నా దేవా! నన్నెందుకు చేయి విడిచావని వాపోయాడు. అది అస్పృశ్యుల అరుపు.

క్రీస్తు సిలువమీద దళితుల వేదనను పరిపూర్ణంగా అనుభవించాడు. సిలువమీద నలిగి నుగ్గయ్యాడు. తెగి తుత్తునియలయ్యాడు, నరులూ దేవుడూ కూడ తన్ను విడనాడారని దుఃఖించాడు. దయామయుడైన దేవుడు గూడ తమ్ము నిరాకరించాడనేది దళితులందరి బాధ, కాని ప్రజలు త్రోసివేసిన రాయే భావనానికి మూలరాయి ఐంది, విధేయుడైన సేవకుడే దళితులకు విమోదకుడయ్యాడు, సిలువమీదికి ఎత్తబడినవాడే ఇప్పడు అందరినీ తన చెంతకు ఆకర్షించుకొంటున్నాడు. అతడు బానిసల దేవుడు, నికృష్ణుల దైవము, పాకీవాళ్ల వేల్పు అయ్యాడు.