పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన "మాలపల్లి' లాంటిది. కాని ఈ యశుద్ధుడైన గలిలయుడే సకల లోకానికి రక్షణాన్ని సంపాదించి పెట్టాడు. ఈ దళితుడే అశుద్దులందరినీ శుద్ధి చేసాడు.

2. క్రీస్తు దళితానుభవం

4. దళితుడి దైవానుభూతి

దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే నా సోదరుడు, సోదరి, తల్లి అన్నాడు ప్రభువు - మార్కు 3, 35, అతనికి రక్త బంధుత్వం, అగ్రకులాలకు చెంది వుండడం ముఖ్యంకాదు. దైవబంధుత్వం, దేవునికి చెందివుండడం ముఖ్యం. నికొదేమ కథలో కూడ అతడు, నీటివలన ఆత్మ వలన జన్మించినవాడే దైవ రాజ్యంలో చేరతాడని చెప్పాడు - యోహా 35. కనుక క్రీస్తుకి నరుల కుటుంబాలకంటె దైవకుటుంబం ముఖ్యం. పెద్దకులాలకు చెంది వుండడం కంటె దేవుని కుటుంబానికి చెంది వుండడం ప్రధానం.

పూర్వవేదపు యూదులు దేవుణ్ణి పరమ పవిత్రుడ్డిగా, జనులకు దూరంగా వుండేవాణ్ణిగా భావించారు. కాని క్రీస్తు దేవుణ్ణి కరుణామయుడ్డిగా, నరుల పాపాలను మన్నించేవాణ్ణిగా బడుగువర్గాలను ఆదరించేవాణ్ణిగా తన్నుకరుణించేవాణ్ణిగా భావించాడు. అతడు దేవుణ్ణి "అబ్బా? - అనగా నాన్నా అని పిల్చాడు. దళితుడుగా తన చిన్నరికాన్ని నిస్సహాయత్వాన్ని అర్థంచేసికొని పూర్తిగా దేవుని మీదనే ఆధారపడ్డాడు. తాను చిన్న బిడ్డల్లా తయారైతేనే గాని దైవరాజ్యంలో ప్రవేశించనని గ్రహించాడు. కులబలం ధనబలం దేవుణ్ణి చేరడానికి ఉపయోగపడవనీ, దిక్కులేని వారికి దేవుడే దిక్కనీ అర్థంచేసికొన్నాడు. ఈ పద్ధతిలో అతడు నిక్కచ్చిగా దళితుడు.

5. దళిత బలిపశువు

దళితులు అశుద్దులు, పేదలు, శక్తిలేనివాళ్లు, క్రీస్తుకూడ ఈలాంటివాడే అతడు అనుభవించిన నిందావమానాలే ఇందుకు నిదర్శనం. అగ్రవర్గాలవాళ్లు అతన్ని మరియ కుమారుడు, గలిలయుడు, భోజన ప్రియుడు, మద్యపాన రతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు, ఉన్మత్తుడు, సమరయుడు, భూతావేశుడు అనే పేర్లతో ఎగతాళి చేసారు. క్రీస్తు పేదరికాన్ని గేలిచేస్తూ ధనికులు అతన్ని వడ్రంగికుమారుడు అని ఎద్దేవా చేసారు. ఏరబ్బయి దగ్గర చదువుకోకుండానే బోధచేస్తున్నాడని తప్పపట్టారు. అసలతనికి బోధ చేసే హక్కు