పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతనికి గౌరవాదరాలు లేవు. వ్యక్తిగా గుర్తింపలేదు. చనిపోయినపుడు సొంత సమాధికూడ లేదు. ఇప్పడు మనకున్నపేరుప్రతిష్టలూ పలుకుబడి అతనికి లేవు. అతన్ని దళితునిగా, పరయనుగా, జాతిభ్రష్టుణ్ణిగా వెలివేసారు. ద్రాక్షతోట వెలుపలకు గెంటివేసి వధించారు. కాని అతడు అనేకుల రక్షణార్థం తన ప్రాణాన్ని క్రయధనంగా సమర్పించాడు- మార్కు 10,45.

యోహాను సువిశేషంలో అతడు బాధామయ సేవకుడు. అతడు శరీరధారి అయ్యాడు 1,14. మన బలహీనతలను చేకొన్నాడు. బహిష్కృతుడై పీడితుల వర్గంలో చేరిపోయాడు. పరపీడనకు వేదనకు గురై ఏడ్పులతో, కన్నీటితో తండ్రికి మొరపెట్టాడు -హెబై 5,7, సాముదాయిక వ్యక్తిగా బలహీనులైన నరులందరినీ, వారి బాధలన్నిటినీ తనలో భరించాడు.

2. వెలివేయబడినవాడు

క్రీస్తు దళితుడుగా వెలివేయబడినవాడు. “అతడు తన వారివద్దకు వచ్చాడుగాని వాళ్లు అతన్ని అంగీకరించలేదు" - యోహా 1,11 నజరేతులో అతని సొంతప్రజలే అతన్ని తిరస్కరించారు. అతడు దళితులైన బాధితుల కోపు తీసికోబోగా ప్రజలతన్ని వూరి వెలుపలికి నెట్టివేసారు. దుషులైన కౌలుదార్ల కథలో అతడు త్రోసివేయబడిన రాయి అయ్యాడు - మార్కు 12,10. అతడు పుట్టినప్పడే బేల్లెహేములో నిరాదరణకు గురై దళితుల దౌర్భాగ్యంలో పాలుపంచుకొన్నాడు. చిన్న శిశువుగా వున్నపుడే హేరోదు లాంటి రాజులూ అధికారులూ అతన్ని హింసించి అన్యదేశాలకు తరిమివేసారు. దళితుడు గనుకనే ఎల్లతావుల్లోను వెలివేయబడ్డాడు.

3. అశుధుడు

దళితులు అశుద్దులు. ఆ వర్గంలో పుట్టినవాళ్లంతా అలాంటి వాళ్లే క్రీస్తుకూడా ఈ యశుద్దుల వర్గంలో చేరిపోయాడు. సువిశేషాలు పేర్కొనే అతని వంశావళిలో కులీనులు కాని తామారు, రూతు, బత్తెబ్ర మొదలైన అపవిత్రులూ అన్యజాతి స్త్రీలూ వున్నారు. వీళ్ల నెత్తురు పంచుకొని వీళ్ల వంశక్రమంలో వచ్చిన క్రీస్తుకూడ అశుధుడు, మరియ కుమారుడు, ' గలిలయ నివాసి, నరపత్రుడు, నజరేయుడు మొదలైన అతని బిరుదాలు కూడా అతడు అనిర్మలుడనే సూచిస్తాయి. గలిలయను యూదులు చిన్నచూపు చూచేవాళ్లు, అది యానాటి