పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. దళితుల కొరకు నవసమాజ స్థాపనం

16. నవసమాజ సభ్యులు
17. నవసమాజ లక్షణాలు
18. దళితోద్యమం భవిష్యత్తు

దళిత క్రీస్తు

కులతత్వవాదులు మనదేశంలోని జనాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్రులని నాలు వర్గాలుగా విభజించారు. ఐదవ వర్గాన్ని పంచములు అన్నారు. వీరికే చండాలులు, అస్పృశ్యులు, అవరులు అనికూడ పేరు. గాంధీ వీరికి హరిజనులని పేరుపెట్టాడు.కాని యిప్పడు వీరిని "దళితులు? అంటున్నారు. నరకబడినది, చీల్చబడినది అని ఈ సంస్కృతపదానికి అర్థం. అనగా దళితులు బాధలకు గురై నలిగిపోయినవాళ్లని భావం.

బైబుల్లో కనిపించే "హనవిం” అనే పేదవర్గానికీ ఈ దళిత వర్గానికీ చాల పోలికలున్నాయి. ఉభయులుకూడ పీడితులు, బాధితులు. ఇన్నాళ్లు అగ్రవర్గాల పీడనకు గురై అణగారిపోయిన దళితులు ఇప్పడు సమాజంమీద తిరగబడుతున్నారు.

దళితుల్లో చాలమంది పూర్వమే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆ మతం తమ బానిసాన్ని తొలగించి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని ఆశించారు. కాని వారి ఆశయం నెరవేరలేదు. చర్చి వాళ్లకు కొంతవరకు తోడ్పడినా వాళ్ల బానిసాన్ని తొలగించలేదు. అందుచే వాళ్లు ఇప్పడు క్రీస్తుపై తమ ఆశలను కేంద్రీకరించుకొన్నారు. బాధలకు, నిందలకు గురైన క్రీస్తు అచ్చమైన దళితుడు అనుకొన్నారు. తమ కష్టాలను అతని కష్టాలతో పోల్చుకొని, అతనినుండి ప్రేరణం పొంది, అతని శక్తితో తమ ఇక్కట్టలను తొలగించుకోగోరుతున్నారు. క్రీస్తు ఏలా దళితుడయ్యాడో రాబోయే పేజీల్లో పరిశీలించిచూద్దాం.

1. క్రీస్తు దళితుడు

1. బానిస, సేవకుడు

క్రీస్తుని బానిసనుగాను, సేవకునిగాను చూచారు. అతని సొంతజనమే అతన్ని అవమానించి నగర ద్వారం వెలుపల క్రూరంగా వధించారు. ఆ ప్రభువు “తన్నుతాను రిక్తని జేసికొని, సేవక రూపాన్ని దాల్చి మానవుల పోలికగా జన్మించాడు”- ఫిలి 2,7.