పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేటి కాపరులు కూడ మంద శ్రేయస్సు కొరకు కృషి చేయాలి. స్వార్ణ లాభాన్ని చూచుకోగూడదు. మందపట్ల శ్రద్దా ప్రేమా పెంచుకోవాలి. దుర్గాభ అపేక్షతోగాక మనఃపూర్వకంగా మందను కాయాలి -1 పేత్రు 5,2. యోగ్యులైన గురువులూ సంఘపెద్దలూ వుపదేశులూ మొదలైనవాళ్లు క్రైస్తవ సమాజానికి గొప్ప వరాలు.

7. పేత్రు యోహానుల అంత్యగతి 21, 18-23

1. పేత్రు వేదసాక్షి మరణం

18-19 వాక్యాలు పేత్రు వేదసాక్షి మరణాన్ని తెలియజేస్తాయి. యువకుడుగా వున్నపుడు పేత్రు స్వేచ్చగా తిరిగాడు. కాని వృద్దుడైన పేత్రుకి ఆ స్వేచ్ఛ వుండదు. శత్రువులు అతన్ని పట్టి నిర్బంధంగా చంపివేస్తారు. అతడు సిలువపై చేతులు చాస్తాడు. అతన్ని త్రాళ్లతో సిలువమానుకి అంటగడతారు. అతడు ఇష్టపడని సిలువ మరణం అనుభవించడానికి అతన్ని తీసికొని పోతారు-19.

క్రీస్తు పేత్రుకి కాపరి అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత తన మరణంలో పాలుపొందే అధికారాన్ని కూడ ఇచ్చాడు. అనగా క్రీస్తులాగే పేత్రుకూడ సిలువపై వేదసాక్షిగా మరణిస్తాడని భావం. కనుకనే పేత్రుతో "నీవునన్ను వెంబడించు" అని చెప్పాడు - 19,22. ఇక్కడ "వెంబడించు" అంటే నావెంట నడువు అని ఒక అర్థం. నాసిలువ మరణాన్ని అనుభవించు అని ఇంకొక అర్థం. పేత్రు రోములో వేదసాక్షిగా మరణించాడని ప్రాచీనచరిత్ర చెప్పంది. ప్రభువు మరణంలాంటి మరణం ఏ కొద్దిమంది భక్తులకోగాని లభించదు.

యోహాను సువిశేషం ఈ 18-19 వచనాలు వ్రాసేటప్పటికి పేత్రుని వాటికన్ కొండమీద సిలువవేసారు. అతడు క్రీస్తుని వెంబడించి వేదసాక్షిగా మరణించాడు. నేడు మనంకూడ యేసుని వెంబడించాలి. మనగురువు సిలువను మోసికొని పోయినవాడు. గురువుకి ఒక త్రోవా శిష్యునికి ఇంకొక త్రోవా వుంటుందా? కనుక కొన్ని కష్టాలైన అనుభవిస్తేనేగాని మనం క్రీస్తుకి నిజమైన శిష్యులం గాలేము.

పేత్రు ప్రభువుకి ప్రీతికరుడైన శిష్యుడు అయ్యాడు. అతనిలాగే క్రీస్తుని విశ్వసించే వాళ్లంతా అతనికి ప్రీతిని కలిగించే శిష్యులు కావాలి. నేడు మనకు క్రీస్తు పట్లగల ప్రేమే మన శిష్యత్వానికి గురుతుగా వుండాలి. పేత్రు యోహానులకు లాగే ప్రభువు మనలో ఒక్కొక్కరికీ ఓ గతినీ, ఓ ప్రత్యేక మరణ విధానాన్నీ నిర్ణయించాడు. మనం ఆ మరణాన్ని అనుభవించి కడన మన గమ్యాన్ని చేరుకోవాలి. కనుక మన జీవితాన్ని లాగే మన మరణాన్ని కూడ ఆ ప్రభువుకే అర్పిద్దాం.