పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడ యోహాను శిష్యవర్గానికి చెందినవే. ఇంకా, ఈయధ్యాయం ప్రాచీన వ్రాతప్రతులన్నిటిలోను కన్పిస్తుంది. కనుక ఇదికూడ విలువైందే.

ఉత్థానక్రీస్తు సాన్నిధ్యం, అతడు శిష్యులచేత చేపలు పట్టించడం, వారికి భోజనాన్ని పెట్టడం ఈ ఘట్టంలోని ముఖ్యాంశాలు. పేత్రూ ఇతర శిష్యులు గలిలయసరస్సులో చేపలు పట్టడానికీ పోయారు — 3. వాళ్లు రక్షణ వుద్యమాన్ని మరచిపోయి లౌకిక వ్యాపారంలో పడిపోయారు. పూర్వం క్రీస్తు చెప్పినట్లుగానే చెల్లాచెదరయ్యారు - 16,32.ఇక్కడ ప్రభువు వాళ్లను మళ్లా ఐక్యపరచాడు. వాళ్లను తన చుటూ చేర్చుకొని వుత్తానానంతరం చేయవలసిన పనిని వాళ్లకు మళ్లా జ్ఞప్తికి తెచ్చాడు.

శిష్యులు స్వయంగా చేపలను పట్టలేకపోయారు -3. కాని ప్రభువు ఆజ్ఞపై వాటిని విస్తారంగా పట్టారు. ఈ చేపలు భావికాలంలో శిష్యులు పట్టబోయే నరులనే సూచిస్తాయి. అనగా వాళ్లు వేదబోధ చేసి చాలమందిని తిరుసభలోనికి కొనివస్తారని భావం. సువిశేషాలు దైవరాజ్య వ్యాప్తిని సూచించడానికి చేపలను పట్టడమనే ఉపమానాన్ని వాడతాయి - లూకా 5,10. శిష్యుల వలలో చిక్కిన చేపలు 153. ఆనాడు ప్రపంచంలో 153 రకాల చేపలు ఉన్నట్లుగా యూదులు భావించారని జెరోము భక్తుడు వ్రాసాడు. ఇక్కడ ఈ సంఖ్య సాంకేతికమైంది. విశ్వవ్యాప్తతను సూచించేది. అనగా భావికాలంలో అన్నిజాతులవాళ్లు తిరుసభలో చేరతారని భావం. 158 చేపలుపడినా వల పిగిలిపోలేదు. ఇన్ని జాతులవాళు చేరినా తిరుసభలో విభజన రాదనీ, అది ఏకసమాజంగా వుండిపోతుందనీ అర్థం. దానికి ఐక్యతనిచ్చేది ప్రభువు ఆత్మే .

ఈ సంఘటనంలో క్రీస్తుని మొదట గుర్తించింది యోహాను -7. అతడు క్రీస్తుని అధికంగా ప్రేమించినవాడు. అందుకే అందరికంటె ముందుగా తాను వుత్తాన క్రీస్తుని గుర్తించాడు. ప్రేమరీత్యా అతడు గొప్పవాడు. ఐతే భావిపరిచర్య రీత్యా పేత్రు గొప్పవాడు. ప్రజలను తిరుసభలోనికి చేర్చడం ప్రధానంగా ఇతని పని. ఈ కథలో చేపలను వొడ్డుకిలాగింది పేత్రేకదా! -11.

ఇక్కడ శిష్యులు భుజించిన రొట్టె చేపలు అనే ఆహారం దివ్య సత్రసాదానికి సూచనంగా వుంటుంది — 3. శిష్యులు క్రీస్తుపేరిట ఐక్యమౌతారు. ఆ శిష్య సమాజానికి ఆహారం దివ్యసత్రసాదమే. ఈ భోజనాన్ని అందించే వాడు మెస్సీయ. అతడు తనభక్త సమాజానికి విందు చేస్తాడు. ఆ విందు మోక్షప విందుకే గుర్తుగా వుంటుంది. దివ్యసత్రసాద భోజనమే ఈ విందు. ఇక్కడ యేసు రొట్టెను చేపలను తీసికొని శిష్యులకు పంచియిచ్చాడు