పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని మనోభావం. ఆనాడు అధిక సంఖ్యాకులైన యూదులు ఈలాగే భావించేవాళ్లు. తర్వాత తోమా ప్రభువుని కన్నులారచూచి అతన్ని విశ్వసించాడు.

క్రీస్తుని దర్శించిన తోమా "నా ప్రభువా నాదేవా" అన్నాడు - 28. ఇవి పూర్వవేదం యావేకు వాడిన మాటలు - కీర్త35, 23. అనగా ఉత్థానక్రీస్తు పూర్వవేదంలోని యావేకు సరిసమానమని భావం. నాల్గవ సువిశేషంలో క్రీస్తు దైవత్వాన్ని సూచించే పట్టులన్నిటిలోను ఇది శిఖరంలాంటిది. ప్రభువు పూర్వమే శిష్యులతో "మీరు నన్ను పైకెత్తినపుడు నేను ఆయననని గ్రహిస్తారు" అని పల్మాడు -8,25. ఆ పలుకు ఇప్పడు అక్షరాల నెరవేరింది. క్రీస్తు యావేకు సరిసమానుడయ్యాడు. ఐతే "నా ప్రభువా నాదేవా" అన్నమాటలు తోమా స్వయంగా పలికాడా? ఇవి తోమా స్వయంగా పలికిన మాటలు కావనీ, తొలినాటి క్రైస్తవులు తమ ఆరాధనలో ఈ పదాలు వాడేవాళ్ళనీ, వాటినే సువిశేషరచయిత తోమా పల్కినట్లుగా వ్రాసాడనీ బైబులు పండితుల అభిప్రాయం. ఏది యేమైనా ఈ పల్కలు తొలినాటి క్రైస్తవులకు క్రీస్తు పట్ల వున్న భక్తివిశ్వాసులకు అద్దంపడతాయి అనాలి.

యోహాను సువిశేషం ప్రజలకు క్రీస్తుపట్ల విశ్వాసం పట్టించడానికి వ్రాయబడింది -20,31. తోమా కథ ఈ విశ్వాసానికి చక్కని నిదర్శనం. ఇక్కడ మూడు రకాల విశ్వాసాలు వున్నాయి. 25వ వచనం యూదుల విశ్వాసాన్ని పేర్కొంటుంది. యూదులు ప్రతిదానికి మేము కంటితో చూస్తేనేకాని నమ్మం అనేవాళ్లు. వాళ్లు క్రీస్తుపట్లగూడ ఈలాగే ప్రవర్తించారు -2, 23–25. ఇక్కడ అపనమ్మకం ముఖ్యాంశం. ఇది పరిపూర్ణమైన విశ్వాసంకాదు. క్రీస్తు ఈలాంటి విశ్వాసాన్ని మెచ్చుకోలేదు. ఇక 26-28 వచనాలు శిష్యుల విశ్వాసాన్ని పేర్కొంటాయి. చూచి విశ్వసించడం ఇక్కడ ముఖ్యాంశం. "నీవు విశ్వసించింది నన్ను చూడ్డం వలనకదా" అన్నాడు ప్రభువు. ఈ విశ్వాసం మంచిదే. అద్భుతాన్ని చూచి దానిలో దేవుని హస్తాన్ని దర్శిస్తాం. క్రీస్తు సమకాలికులు క్రీస్తు అద్భుతాలను చూచి అతని దైవత్వాన్ని నమ్మారు. శిష్యులు ఆనాడు క్రీస్తుని విశ్వసించివుండకపోతే నేడు మనం కూడ అతన్ని నమ్మలేం. క్రీస్తు ఈ రకం విశ్వాసాన్ని నిందించలేదు. ఐనా యిది శ్రేష్టమైన విశ్వాసంకాదు. కడన, 29వ వచనం క్రైస్తవుల విశ్వసాన్ని పేర్కొంటుంది. ఇక్కడ చూడకుండానే విశ్వసించడం ముఖ్యాంశం. శిష్యులు ఉత్థాన క్రీస్తుని చూచి నమ్మారు. కాని యిప్పడు మనం అతన్ని కంటితో చూడకుండానే నమ్మాలి. ఇది శ్రేష్టమైన విశ్వాసం. క్రీస్తు దీన్ని ప్రశంసించాడు.