పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. ఆత్మ ప్రదానం

ప్రభువు శిష్యుల మీదికి ఆత్మను వూదాడు -22. క్రీస్తు ఆత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడు. అనగా ఆత్మను దయచేసేవాడు-1,33. ఈ యాత్మశక్తితోగాని శిష్యులు క్రీస్తు ప్రేషిత సేవను కొనసాగించలేరు. ఈ యాత్మ క్రీస్తుకి సాక్ష్యం పలికే ఆత్మ -15,26-27. ఇప్పడు ఈ యాత్మ బలంతోనే శిష్యులుగూడ ప్రభువుకి సాక్ష్యం పలకాలి. ఈ యాత్మను లోకం ఎరుగదు, పొందలేదు - 14,17. కాని శిష్యులు ఇప్పడు తాము పొందిన ఆత్మను లోకానికి తెలియజేస్తారు. ఇంకా ఈ యాత్మ జీవమిచ్చే ఆత్మ-3,6. ఈ యాత్మ నుండి పొందిన జీవాన్నే శిష్యులు ఇతరులకు ప్రసాదించేది. ఆత్మ యిక క్రీస్తు స్థానాన్ని పొందుతుంది. క్రీస్తుకి బదులుగా తాను శిష్యులకు ఆదరణ కర్త ఔతుంది - 14,16. ఐనా ఆత్మ క్రీస్తుని వదలివేయదు. అతన్ని వారికి ప్రత్యక్షం చేస్తూంటుంది.

సృష్ట్యాదిలో దేవుడు నరునిలోనికి తన శ్వాసను ఊదాడు- ఆది 2,7. అది ప్రాత సృష్టి ఇప్పడు శిష్యుల ప్రేషిత సేవద్వారా నూత్న సృష్టి ప్రారంభం కాబోతుంది. ఈ నూత్న సృష్టి ఆరంభంలోకూడ దేవుని ఆత్మ శిష్యుల మీదికి దిగివచ్చి వారిని చైతన్యవంతులను చేస్తుంది. ఇక్కడ ఆత్మదిగిరావడాన్ని శిష్యుల జ్ఞానస్నానంగా భావించాలి. ఉత్తాన క్రీస్తకీ శిష్యులకూ గల వ్యక్తిగత సంబంధం ఈ వాక్యంలో కొండ శిఖరాన్ని అందుకొంది –22.

అపోస్తలుల చర్యలు 2లో లూకా ఆత్మ ఆగమనాన్ని ఒక పద్ధతిలో వర్ణించాడు. ఇక్కడ యోహాను ఇంకో పద్ధతిలో వర్ణించాడు. బైబుల్లో భిన్న సంప్రదాయాలు వున్నాయి.

4. పాపపరిహారం

ప్రభువు శిష్యుల మీదికి ఆత్మను వూది వారికి పాపాలను పరిహరించే శక్తి నిచ్చాడు - 23. మొదట క్రీస్తుకే పాపాలను పరిహారించే శక్తివుంది -1,29. అతడిప్పడు శిష్యులకు ఆత్మనిచ్చాడు కదా! ఆయాత్మ సహాయంతో తానే శిష్యుల ద్వారా నరుల పాపాలను మన్నిస్తాడు. నరులు రెండు వర్గాలు ఔతారు. క్రీస్తుని విశ్వసించి అతనినుండి పాపపరిహారం పొందేవాళ్ళ ఒక వర్గం. అతన్ని విశ్వసింపక అతనినుండి పరిహారాన్ని పొందనివాళ్ళు ఇంకో వర్గం. అనగా పాపపరిహారానికి హృదయాన్ని సిద్ధంజేసికొనేవాళ్ళు ఆ వరాన్ని పొందుతారు. ఆలా సిద్ధంజేసికోనివాళ్ళ ఆ వరాన్ని పొందలేరు.

కాని ప్రోటస్టెంటులు ఈ వాక్యానికి భిన్నమైన అర్థం చెప్తారు. శిష్యులు నరులకు క్రీస్తు పేరిట పాపపరిహారాన్ని బోధించి అతన్ని విశ్వసించినవాళ్ళకు జ్ఞానస్నానం ఈయాలని