పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు శరీరానికి చుట్టిన బట్టలు సమాధిలోనే వున్నాయి. అనగా యూదులు వాదించినట్లుగా దొంగలు అతని శవాన్ని ఎత్తుకొనిపోలేదు. ఎత్తుకొని పోయినట్లయితే శవవస్తాన్ని విప్పి అక్కడ వదలివేయరు. దానితోపాటే శవాన్ని ఎత్తుకొని పోయేవాళ్ళు ఇంకా, దొంగలు శిరో వస్తాన్ని మడిచి ప్రక్కనపెట్టరు. వాళ్ళు గబగబా వెళ్ళిపోతారు కదా! కనుక క్రీస్తుదేహాన్ని దొంగలు ఎత్తుకొని పోలేదు అనుకోవాలి. ఐనా ప్రేతం సమాధిలో కన్పించడం లేదు. అది యేమైందో పేత్రుకి అంతుపట్టలేదు. ఈ సందర్భంలో ఇంకా లోతైన భావంకూడ వుంది. క్రీస్తు తన వస్తాలను వదలివేసాడు. ఇకమీదట అతనికి వాటితో అవసరంలేదు. ఇక అతడు శారీరక జీవితంగాక ఆధ్యాత్మిక జీవితం గడుపుతాడు. మరణంనుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణించడు - రోమా 6, 9. దీనికి భిన్నంగా లాజరు చావునుండి లేచినపుడు ప్రేతవస్త్రంతోనే లేచాడు. ఇది అతడు మరల జీవించి చనిపోతాడు అనడానికి గురుతు - యోహా 11,44 పేత్రూ యోహాను ఇద్దరూ ప్రేతవస్తాలను చూచారు. పేత్రుకి క్రీస్తు ఏమయ్యాడో అర్థం కాలేదు. యోహాను మాత్రం అతడు వుత్తానమయ్యాడని గ్రహించి విశ్వసించాడు8. ప్రభువుపట్ల అతని ప్రేమ గొప్పది. కనుక అతడు ప్రభువు ఉత్థానాన్ని గ్రహింపగలిగాడు. క్రీస్తుని ప్రేమించేవాళ్ళ వేదశాస్తులకంటెగూడ అధికంగా అతన్ని అర్థం జేసికొంటారు. భగవంతుని దగ్గరికి వెళ్ళినపుడు మన హృదయంలోని ప్రేమ అన్నిటికంటె ముఖ్యమైంది. దైవప్రేమ కలవాళ్ళు అతన్ని త్వరగా అర్థం జేసికొని అనుభవానికి తెచ్చుకొంటారు. తర్వాత తోమా క్రీస్తు వుత్తానాన్ని శంకిస్తాడు. అతన్ని కంటితో చూస్తేనేగాని విశ్వసించను అంటాడు. కాని తోమాతో పోలిస్తే యోహాను గొప్ప విశ్వాసి. అతడు సమాధిలోని బట్టలను చూచే క్రీస్తు వుత్తానమయ్యాడని నమ్మాడు. నేడు మనలో విశ్వాసంగల క్రైస్తవులు ఎంతమంది? శిష్యులూ మరియ మగ్డలీనా క్రీస్తు వుత్తానాన్ని గుర్తించడానికి ఖాళీ సమాధి కారణమైంది. ఈ నాల్గవ సువిశేషాన్ని వ్రాసేటప్పటికీ క్రీస్తు సమాధి యాత్రాస్థలం కూడ ఐయుంటుంది. అయినా శిష్యులు వుత్తానాన్ని విశ్వసించింది ఖాళీ సమాధిని బట్టిగాదు, క్రీస్తు దర్శనాలనుబట్టి. నేడు మన హృదయాల్లో ఉత్తాన క్రీస్తుపట్ల విశ్వాసం పుట్టించేది పవిత్రాత్మే 2. మరియ మగ్డలీనకు దర్శనం 20, 11-18 ఇది పరమభక్తి భావాన్ని సూచించే దర్శనం. ఇంకా యిది శిష్యులు క్రీస్తుని గుర్తుపట్టేదర్శనం కూడ ఈలాంటి దర్శనాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఎమ్మావు శిష్యుల దర్శనం కూడ ఈలాంటిదే - లూకా 24. 106