పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ఉత్యాన క్రీస్తుదర్శనాలు

బైబులు భాష్యం - 132

విషయసూచిక

1.ఖాళీ సమాధి వదంతం

2.మరియు మగ్డలీనకు దర్శనం

3.శిష్యులకు దర్శనం

4.తోమాకు దర్శనం

5.సరస్సు తీరాన దర్శనం

6.పేత్రుకి అధికారం

7.పేత్రు యోహానుల అంత్యగతులు

యోహాను 20-21 అధ్యాయాలు క్రీస్తు వుత్తానాన్నీ అతడు శిష్యుల కిచ్చిన దర్శనాలనూ వర్ణిస్తాయి. ఈ భాగంలో మొత్తం 7 సంఘటనలు వున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. ఖాళీ సమాధి వదంతం 20, 1–10

తొలి రోజుల్లో క్రీస్తు వుత్తానాన్ని గూర్చి క్రైస్తవులకూ యూదులకూ వాదోపవాదాలు జరుగుతుండేవి. యూదులు క్రీస్తు వుత్తానం కాలేదు అతని శిష్యులే వచ్చి దొంగతనంగా అతని దేహాన్ని ఎత్తుకొని పోయారు అని వాదించేవాళ్ళు ఆ సందర్భంలో క్రైస్తవులు ఖాళీ సమాధికి గొప్ప ప్రాముఖ్యమిచ్చారు. అది క్రీస్తు వుత్తానానికి సాక్ష్యం పలుకుతుంది అన్నారు.

ఆదివారం వేకువన మరియ మగ్డలీన క్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళింది. చనిపోయిన వారికొరకు సమాధి దగ్గర విలపించడం యూదుల ఆచారం - యోహాను 11,31. ఇక్కడ మగ్డలీన కూడ భక్తిభావంతో విలపించడానికే సమాధి దగ్గరికి వచ్చింది అనుకోవాలి. ఆమె సమాధి తెరువబడి వుండడం చూచి పేత్రు యోహానుల వద్దకుపోయి ఆ సంగతి తెలియజేసింది. ఆ యిద్దరు శిష్యులు వెంటనే సమాధి దగ్గరికి పరుగెత్తారు. యోహాను వేగంగా పరుగెత్తి ముందుగా సమాధిని చేరుకొన్నాడు. అతని హృదయంలో క్రీస్తుపట్ల అధిక ప్రేమ వుంది. కనుకనే అధికవేగంతో పరుగెత్తగలిగాడు. ఐనా పేత్రు పట్లగల గౌరవంచే అతడు ముందుగా సమాధిలోకి పోలేదు. పేత్రుని ముందు పోనిచ్చి తర్వాత తాను పోయాడు. అక్కడ వారికి క్రీస్తు శరీరానికి చుట్టివుంచిన నారబట్టలు కన్పించాయి. అతని తలకు చుట్టిన వస్త్రం మడిచిపెట్టబడి ఒక ప్రక్కన వుంది. వాటి భావం ఏమిటి? 105