పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకృతి వుండాలి. పిశాచ శక్తిని పారదోలడానికి సిలువ బాగా వుపయోగపడుతుంది. క్రీస్తు శ్రమల సాధనమూ, విజయ చిహ్నమూ ఐన సిలువను భక్తిభావంతో ధ్యానించుకోవాలి. మన పిల్లలకు సిలువ పేరు పెట్టడం కూడ ఉచితమే.

ప్రార్థనా భావాలు

1.క్రీస్తు సిలువ అతని శ్రమలనూ విజయాన్నీ కూడ సూచిస్తుంది. నేడు మనం సిలువను ఈ రెండర్గాల్లోను గ్రహించాలి.

2.నేను క్రీస్తుతోపాటు సిలువ వేయబడ్డాను అని చెప్పకొన్నాడు పౌలు భక్తుడు. కొలదిగానైనా సిలువను మోయందే క్రీస్తు శిష్యులం కాలేము. అసలు మనం సిలువను తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం. కనుక మన పాలబడిన సిలువను మనం అంగీకరించడం మంచిది.

3.మోషే గడెమీదికి ఎత్తి చూపిన పాములాగే క్రీస్తు కూడ సిలువమీదికి ఎత్తబడినవాడు. సిలువ వేయబడిన ప్రభువుని విశ్వాసంతో వీక్షించి మనం రక్షణం పొందాలి.

4.క్రైస్తవ జీవిత సారమంతా "సిలువ" అనే మూడక్షరాల చిన్న మాటలో ఇమిడి వుంది. మన భక్తి మార్గాల్లో సిలువకు కూడ ప్రముఖస్థానం వుండాలి.

5.క్రీస్తు మొదట శ్రమలు అనుభవించి తర్వాత మహిమలో ప్రవేశించడం అనివార్యం. సిలువ లేకుండానే మనలను రక్షించేమార్గం వుంటే ప్రభువు తప్పకుండ ఆ మార్గాన్నే ఎన్నుకొనేవాడు. ఇప్పడు గురువు పోయిన మార్గంలోనే శిష్యుడు కూడ పోవాలి.

6.పూర్వం పిశాచం ఒక చెట్టెక్కినరుణ్ణి ఓడించింది. క్రీస్తు మరొక చెట్టెక్కి పిశాచాన్ని ఓడించాడు. ఈ జీవవృక్షాన్ని మనం పలుసార్లు భక్తిభావంతో మననం చేసికోవాలి.

7.క్రీస్తు సిలువ ద్వారా రక్షణం పొందివుండకపోతే మనం పట్టివుండి కూడ ప్రయోజనంలేదు. ఆదాము పాపంవల్ల మనం శాశ్వతంగా దేవునికి దూరమయ్యేవాళ్ళమే.

8.పౌలు చెప్పినట్లుగా క్రైస్తవుడు ఈ లోకానికీ, ఈ లోకం క్రైస్తవునికి సిలువ వేయబడాలి. లోక్ష వ్యామోహాలతో జీవించేవాళ్ళు దేవునికి ప్రీతి కలిగించలేరు. ఇద్దరు యజమానుల సేవ పనికిరాదు.

9.కొన్ని పర్యాయాలు క్రీస్తు సిలువ మనమీద భారంగా వాలుతుంది. బాధలూ వ్యధలూ మనలను క్రుంగదీస్తాయి, కాని ఈ సిలువవల్ల గురువుని పోలిన శిష్యులమై పునీతులమౌతాం. కనుక శ్రమల్లో దేవునిమీద మొరపడకూడదు.

10.క్రైస్తవులమైన మనం ఈ దేశంలో అల్పసంఖ్యాకులం. ఐనా అన్యమతస్తులముందు మన రక్షణ సాధనమైన సిలువను ప్రదర్శించడానికి ఏమీ సిగ్గుపడకూడదు. ఈ లోకంలో మనం క్రీస్తుని అంగీకరించకపోతే పరలోకంలో అతడు మనల నేలా అంగీకరిస్తాడు?

11.మన బాలబాలికలకు సిలువ పేరు పెట్టాలి.