పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 సిలువ భక్తి సమర్థనీయం

తమ రక్షణ సాధనమైన సిలువపట్ల క్రైస్తవులు భక్తిప్రపత్తులు చూపడంలో ఆశ్చర్యంలేదు. ਕੇeo జాబుల్లోనే సిలువభక్తి అక్కడక్కడ తగులుతుంది - గల 6,14 కోలో 1,20. క్రీస్తు సిలువ శ్రమలను సూచించేదే. కాని అతడు ఈ సిలువ ద్వారానే పాపాన్నీ మృత్యువనీ జయించాడు, విజయాన్ని సాధించాడు. కనుక అది నేడు మన జీవితంలో కూడ శ్రమలను సూచించినా, ప్రధానంగా రక్షణాన్నీ జీవాన్నీ సూచిస్తుంది. అది నేడు మనకు మహిమను పొందిన క్రీస్తురాజు జెండా, విజయ సంకేతనం, అతని వుత్తానాన్ని జ్ఞప్తికి తెచ్చేఏది. లోకాంతంలో ప్రభువు న్యాయాధిపతిగా విచ్చేసినపుడు సిలువతోనే వస్తాడు.

తొలిరోజుల్లోనే క్రైస్తవులు భక్తిభావంతో తమ యిండ్లమీదా తాము వాడుకొనే వస్తువుల మీదా సిలువ ఆకృతులు నిల్పుకొన్నారు. క్రీస్తు వాడిన సిలువను కనుగొన్నాక సిలువ భక్తి బాగా వ్యాప్తిలోకి వచ్చింది. సిలువ భాగాలను పవిత్ర అవశేషాలుగా భావించి ప్రపంచం నలుమూలలకు పంపించారు. చాలమంది పవిత్ర సిలువను ఆరాధించడానికి యెరుషలేము యాత్ర చేసారు.

క్రీస్తు స్వరూపాలనూ సిలువనూ పునీతుల స్వరూపాలనూ పూజించాలని నైసీయా మహాసభ 787లో ఆజ్ఞాపించింది. స్వరూపాలను పూజించినపుడు ఆ పూజ అవి సూచించే వ్యక్తులకే చెల్లుతుందని స్పష్టం చేసింది. సిలువకు "ఆరాధన" చెల్లుతుందని వేదశాస్తులు వివరించారు. పెద్ద శుక్రవారం మనం సిలువ ముందు మోకరిల్లతాం. సిలువను ముదుపెట్టుకొని ఆరాధిస్తాం. ఆ దినం మనం సిలువను క్రీస్తు శ్రమల చిహ్నంగా మాత్రమే గాక అతని విజయ చిహ్నంగా గూడ భావిస్తాం, ఈలా దైవార్చనలో సిలువపట్ల గౌరవాన్నీ ఆరాధన భావననూ ప్రదర్శించే సందర్భాలు చాలా వున్నాయి.

325 నుండి తిరుసభలో సిలువ వుత్సవాన్ని జరుపుతున్నారు. మొదట ఈ పండుగ యెరుషలేములో పవిత్ర సిలువను కనుగొన్న సంఘటనను ఆధారంగా జేసికొని పట్టింది. నేడు ఈ పండుగను సెప్టెంబరు 14న క్రైస్తవ ప్రపంచమంతటా జరుపుతున్నారు. దీనికి పవిత్ర సిలువ విజయోత్సవం అని పేరు. మన రక్షణచిహ్నాన్ని అర్థం జేసికోవడానికి గౌరవించడానికి ఈ వుత్సవం బాగా వుపయోపగడుతుంది.

నేడు క్రైస్తవులమైన మనకు సిలువ పట్ల అపార గౌరవమూ భక్తి వుండాలి. దాన్ని అన్యమతస్తుల యెదుట బహిరంగంగా ప్రదర్శించడానికి ఏ మాత్రం సిగ్గుపడ కూడదు. రాత్రి పండుకోవడానికి ముందూ, ఉదయం నిద్రలేచాక, భోజనానికి ముందూ వెనుక సిలువ గురుతు వేసికోవడం మంచిది. కొందరు మెడలో సిలువను ధరిస్తారు. ఇది కూడ యోగ్యమైన అలవాటే. మనం దీర్ఘకాలం పనిజేసుకొనే తావులో కూడ సిలువ