పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంపరు. కాని క్రీస్తు ఆత్మత్యాగమూ ఆత్మార్పణమూ, శ్రమలూ, మరణమూ మనలో కూడ కన్పించాలి. అప్పుడే మనం నిజమైన శిష్యులమయ్యేది. అతనిలో అక్షరాల నెరవేరిన సిలువమరణం మనలలో సాంకేతికంగా నెరవేరుతుంది. ప్రభువు కొరకు మనం బంధుమిత్రులను త్యజించాలి - 10,37. అతని కొరకు వేదహింసలు అనుభవించాలి - 23,34. ఇక్కడ అతని శ్రమలను అనుభవించేవాళ్ళు పరలోకంలో అతని మహిమను పొందుతారు - యోహా 12,26. క్రీస్తు సిలువను మోయనివాడు ప్రభువుకి యోగ్యుడుకాడు - మత 10,38.

2. సిలువ వేయబడిన జీవితం

శిష్యులది సిలువ వేయబడిన జీవితం. ఈ యంశాన్ని పౌలు చక్కగా వివరించాడు. అతని భావాల ప్రకారం, యూదులకు ధర్మశాస్త్రం వలన రక్షణం లభించింది. కాని క్రైస్తవులకు క్రీస్తుని విశ్వసించడం ద్వారా రక్షణం సిద్ధిస్తుంది. నేడు మనం శారీరక వాంఛల ప్రకారంగాక ఆత్మ ప్రబోధాల ప్రకారం జీవించాలి. రక్షణమూ జ్ఞానమూ సిలువలోనే వున్నాయి. సిలువపై మరణించిన యేసుని కన్నుల ముందట నిల్పుకొని మనం రక్షణం పొందాలి - గల 3,1. క్రీస్తుకు చెందినవాళ్ళు వ్యామోహాలతో గూడిన తమ మానవ స్వభావాన్ని సిలువవేయాలి — గల 5,24. ధర్మశాస్త్రం ఇప్పుడు మనలను రక్షించదు. పౌలు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొంది ధర్మశాస్తానికి చనిపోయాడు - గల 2,19. దేవుని కొరకు జీవించాడు. క్రీస్తుతోపాటు సిలువవేయబడ్డాడు. ఇంకా అతడు ఈ లోకానికి సిలువ వేయబడ్డాడు. ఈ లోకం కూడ అతనికి సిలువ వేయబడింది. అనగా అతడు లోకవాంఛలను అణచుకొని క్రీస్తు శిష్యుడుగా జీవించాడని భావం - గల 6,14. ఇది మహావాక్యం. అతడు క్రీస్తు సిలువకు శత్రువు కాదల్చుకోలేదు. కనుక తన నమ్మకమంతా క్రీస్తునందే వుంచాడు - ఫిలి 3,18. ఇవి లోతైన భావాలు. పౌలు భావాలు మనవికూడ కావాలి. అతనిలాగే మనం కూడ ఇప్పుడు నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పుకోగలిగి వుండాలి - గల 2,10.

3. సిలువ క్రైస్తవులకు మహిమను చేకూర్చేది

మనలోని పాతమానవుడు సిలువ వేయబడాలి - రోమా 6,6. వినయవిధేయులతో సిలువ మరణానికి గూడ పాల్పడిన క్రీస్తుని మనం అనుసరించాలి - ఫిలి 2,8. ఎల్లవేళల క్రీస్తు మనకు ఆదర్శంగా వుండాలి. అతడు సిలువపై శ్రమలు అనుభవించి మనకొక దృష్టాంతాన్ని చూపాడు. అతడు మన పాపాలను మోసికొనిపోయి వాటిని సిలువకు అప్పగించాడు. దానివలన మనం పాపానికి మరణించి పుణ్యానికి జీవించాలి - 1 పేత్రు