పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీక్షించి అతనినుండి రక్షణాన్ని పొందాలని భావం. ఇది కూడ అతని కీర్తినే చాటుతుంది. అతని సిలువ మనకు జీవవృక్షమౌతుంది. ఈ వృక్షం కాసిన ఫలాలు మనకు ఆహారమౌతాయి కూడ - దర్శ 22, 2.14.

5. పూర్వవేదంలోని సూచనలు

పూర్వవేదం చాలా తావుల్లో క్రీస్తు సిలువను సూచిస్తుంది. యూదుల పాస్క సంఘటన వుంది. దాని ద్వారా వాళ్ళు ఈజిప్టునుండి వాగ్దత్త భూమికి వెళ్ళిపోయారు. అసలు పాస్క అంటేనే దాటిపోవడం అని అర్థం. క్రీస్తుకూడ తన సిలువ మరణమనే పాస్క ద్వారా ఈ లోకం నుండి తండ్రి వద్దకు సాగిపోయాడు - యోహా 13,1. శుక్రవారం సాయంత్రం క్రీస్తు సిలువమీద చనిపోతూండగా యూదులు దేవాలయంలో పాస్క గొర్రెపిల్లలను వధిస్తున్నారు. ఆ గొర్రెపిల్లలు క్రీస్తు గొర్రెపిల్లనే సూచిస్తాయి. కనుక ఆయేటి ప్రధానమైన పాస్క గొర్రెపిల్ల అతడే - 19,36. సీనాయి కొండవద్ద యూదులకూ దేవునికీ మధ్య నిబంధనం జరిగింది. ఆ నిబంధన మధ్యవర్తి మోషే - నిర్గ24,8. నూత్నవేదంలో క్రీస్తుసొంత నెత్తురు చిందించి దేవునికి మానవునికి మధ్య నిబంధనం చేసాడు. అతడు నూత్న నిబంధన మధ్యవర్తి - మార్కు 14,24. పూర్వవేదంలో బాధామయ సేవకుడున్నాడు. అతడు తన ప్రాణాన్ని పాపపరిహారబలిగా సమర్పించి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసాడు - యెష53, 10. నూత్నవేదంలో ఈ బాధామయ సేవకుడు క్రీస్తే, పూర్వవేదంలో మెస్సీయా రాజు వున్నాడు. ఇతడు దావీదు రాజ్యాన్ని పునరుద్ధరించేవాడు. నూత్నవేదంలో ఈ రాజు క్రీస్తే - యోహా 18,37. ఎడారి కాలంలో మోషే సర్పాన్ని గడెమీది కెత్తి చూపించి యూదులను పాముకాటునుండి రక్షించాడు - సంఖ్యా 21,9. నూత్నవేదంలో క్రీస్తు ఆ సర్పంలాగే పైకెత్తబడి మనలను పాపంనుండి రక్షించాడు - యోహా 3,14. 22వ కీర్తన పెక్కుబాధలు అనుభవించిన నీతిమంతునొకట్టి పేర్కొంటుంది. నూత్న వేదంలో ఈ నీతిమంతుడు క్రీస్తే -మత్త 27,46. ఈ విధంగా పూర్వవేదంలోని చాల వ్యక్తులు, చాల సంఘటనలు, నూత్న వేదంలోని క్రీస్తునీ అతని సిలువనూ సూచిస్తుంటారు.

2. క్రైస్తవుని సిలువ

1. గురువు సిలువ శిష్యుల సిలువకూడ

మనం కూడ గురువుపోయిన త్రోవలోనే పోవాలి. కనుకనే ప్రభువు “నన్ననుసరింప గోరేవాడు తన్ను తాను పరిత్యజించుకొని, తన సిలువను తీసికొని, నన్ను అనుసరించాలి" అని వాకొన్నాడు - మత్త 16,24. నేడు మనల నెవరూ సిలువేసి