పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయేవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం వాకొంది. కాని క్రీస్తు సిలువపై మరణించి శాపగ్రస్తుడైంది తన పాపాలకొరకు కాదు, మన పాపాల కొరకు. కనుక అతన్ని విశ్వసించడానికి మనం ఏ మాత్రం సందేహించకూడదు - గల 3,13. సిలవపై చనిపోయిన క్రీస్తు మానవదేహం దేహధారులమైన మన పాపాలకు పరిహారం చేసింది - రోమా 8, 3. క్రీస్తు సిలువ మరణంద్వారా తండ్రి మన పాపపు ఋణపత్రాన్ని రద్దుచేసాడు - కొలో 2, 14. యేసు సిలువపై చిందించిన నెత్తురు ద్వారా అతడు సర్వప్రపంచాన్ని తనతో సమాధాన పరచుకొన్నాడు - కొలో 1,20. యూదులకూ అన్యజాతివారికీ మొదటినుండి వైరం వుండేది. క్రీస్తు మరణంద్వారా ఈ వృభయజాతులకు మధ్యగల అడుగోడ తొలగిపోయి శాంతి నెలకొంది. ఇప్పుడు ఆ రెండు జాతులు ఏకమై తండ్రిని చేరగల్లుతున్నాయి - ఎఫే 2, 13-18 సిలువ క్రీస్తుకి మనపట్ల గల ప్రేమను తెలియజేస్తుంది. అది మనలను నూత్న మానవులను చేస్తుంది - గల 6,15. ఈలాంటి లోతైన భావాలు పౌలు జాబుల్లో చాల వున్నాయి. క్రీస్తు సిలువ తండ్రి జ్ఞానాన్ని ప్రదర్శిస్తుందని అతడు చాలసార్లు చెప్పాడు. సిలువ ద్వారా నరులకు రక్షణం కలగాలని నిర్ణయించడమే తండ్రి జ్ఞానం.

4. సిలువ క్రీస్తు మహిమను సూచిస్తుంది

పౌలు భావాల ప్రకారం క్రీస్తు సిలువ అతని శ్రమలనూ, అవమానాన్నీ సూచిస్తుంది. తొలి ముగ్గురు సువిశేషకారులు సిలువ మరణం తర్వాత క్రీస్తు మహిమను పొందాడని వ్రాసారు. కాని యోహాను భావాల ప్రకారం క్రీస్తుకి సిలువ మరణంలోనే గొప్ప మహిమ కలిగింది. ఈ భావాన్ని కొంచెం విపులంగా పరిశీలిద్దాం. క్రీస్తు సిలువ మీదికి ఎత్తబడతాడు - యోహా 12, 32. ఇక్కడ ఎత్తబడ్డమంటే సిలువ మరణమే. కాని ఈ యెత్తబడ్డం అతనికి అవమానాన్ని కాక మహిమను కలిగిస్తుంది. ఇంకా, మోషే ఎడారిలో సర్పాన్ని ఎత్తినట్లుగా క్రీస్తుని సిలువ మీదికెత్తి చూపిస్తారు - 3, 14. సంఖ్యా 21,9. ఈ యెత్తబద్దం కూడ క్రీస్తుకి మహిమను తెచ్చిపెడుతుంది. యోహాను సువిశేషంలో క్రీస్తు రాజరీవితో సిలువ దగ్గరికి నడుస్తాడు. రాజు సింహాసన మెక్కినట్లుగా అతడు సిలువ నెక్ముతాడు. సిలువపైనుండే అతడు తన ఆత్మను వదలుతాడు - 19,30. ఇక్కడ "ప్రాణము విడిచెను" అన్న మూలంలోని గ్రీకు మాటలను "ఆత్మను విడిచెను" అనికూడ అనువదించవచ్చు. సిలువమీద వుండగానే అతని ప్రక్కలోనుండి నీళ్ళ నెత్తురు స్రవించాయి - 19,34. ఈ యాత్మద్వారా, ఈ జలరకాల ద్వారా తిరుసభ స్థాపింపబడింది. ఈ ప్రక్రియ అంతా అతనికి మహిమనే చేకూర్చిపెడుతుంది. ఇకమీదట మనం పొడవబడిన వానివైపు చూడాలి - 19,37. అనగా మనం ఈటెతో పొడవబడిన ప్రభువుని విశ్వాసంతో