పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎరుగరు. కుమారుడు ఎవరికి ఎరిగింపయిష్టపతాడో వాళ్ళ మాత్రమే తండ్రిని ఎరుగుతారు - మత్త 11,27. ఈ సత్యాన్ని మనం వినయంతో అంగీకరించాలి. ప్రాచీన కాలంలోనే టెరూలియను అనే వేదశాస్త్రి చెప్పినట్లుగా, దేవుణ్ణి తండ్రీ అని పిలిచే జ్ఞానం నరులెవరికీ లేదు. పూర్వం మోషే నీవెవరివని ప్రశ్నింపగా దేవుడు నేను ఉన్నవాడను అని మాత్రమే చెప్పాడు. దేవుణ్ణి తండ్రి అని పిలవాలనే జ్ఞానం మనకు మొదట కలిగించినవాడు కుమారుడు. అసలు కుమారుడు అనే మాటే తండ్రి అనేపదాన్ని జ్ఞప్తికి తెస్తుంది.

క్రీస్తు అతని ఆత్మా దేవుణ్ణి తండ్రి అని పిలవాలని మనకు తెలియజేసారు. క్రీస్తుకి తండ్రికీ వుండే సంబంధం మనకు కాదు గదా సన్మనస్కులకు కూడ తెలియదు. ఐనా ఆత్మ మనకు ఆ దివ్య సంబంధంలో భాగం దయ చేస్తుంది. మనం దేవునినుండి జన్మించామని తెలియజేస్తుంది. ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవమని ప్రోత్సహిస్తుంది.

పరలోక జపం చెప్పకొనేపడు మనకు దేవునితోను అతని కుమారునితోను ఐక్యత సిద్ధిస్తుంది. దేవుణ్ణి తండ్రి అని సంబోధించినపుడు మొట్టమొదట అతనిపట్ల ఆరాధన భావాన్ని చూపుతాం. ఆ పిమ్మటనే అతనికి మన విన్నపాలు తెలుపుకొంటాం. దేవుని పేరు తెలిసికోవడం, అతన్ని తండ్రినిగా భావించడం, అతన్ని నమ్మడం, అతడు మన హృదయంలోనే వసిస్తున్నాడని గ్రహించడం మహా భాగ్యాలు కదా!

పరలోకజపం మనకు దేవుణ్ణి తెలియజేస్తుంది, ఇంకా అది మన మెవరిమో మనకు తెలియజేస్తుంది కూడ. ఆంబ్రోసు భక్తుడు ఈలా వాకొన్నాడు. "నరుడా! మంటి వైపు జూచే నీవు దేవునివైపు చూడలేకపోయావు. దిడీలున క్రీస్తు వరప్రసాదాన్ని పొంది నీ పాపాలను ప్రాయశ్చిత్తం చేసికొన్నావు. దుష్టసేవకుడవైన నీవు మంచి కుమారుడవయ్యావు. తండ్రి జ్ఞానస్నానం ద్వారా నీకు నూత్న జన్మనిచ్చాడు. కుమారుని ద్వారా నిన్ను రక్షించాడు. కనుక అతన్ని మా తండ్రి అని పిలువు."

మన భాగ్యమంతా క్రీస్తు ద్వారా తండ్రికి దత్తపుత్రులం కావడంలోనే వుంది. ఈ దత్తత అనే వరం మనకు రెండు సత్యాలను నేర్పుతుంది. మొదటిది, బిడ్డలమైన మనం మన తండ్రిలాంటివాళ్ళం కావాలి. అతడు మనలను తనకు పోలికగా చేసాడు - ఆది 1,27. మనం పాపం వలన పోగొట్టుకొన్న దైవపోలికను తిరిగి వరప్రసాదం ద్వారా పొందాం. కనుక మనం ఎప్పుడూ దేవుని బిడ్డలంగా ప్రవర్తించాలి, దేవుని దివ్యగుణాలు, కారుణ్యం మనలోగూడ కన్పించాలి. మనం నిరంతరం దేవుని ధ్యానించుకోవాలి. మన ఆత్మను అతని సాన్నిధ్యంతో నింపుకోవాలి.

రెండవది, మనం వినయంతోను నమ్మకంతోను చిన్నబిడ్డల్లా దేవుణ్ణి సమీపించాలి. పసిబిడ్డల కాని అతన్ని తెలిసికోలేరు - మత్త 11.25. ఇంకా మనం ప్రార్ధనం