పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9.దేవుడు మనకంటికి కన్పించడు. విశ్వాసం ద్వారానే గాని అతనితో పరిచయం గలిగించుకోలేం. కంటికి కన్పించే ప్రాపంచిక వస్తువుల ఆకర్షణకు లొంగిపోయి కంటికి కన్పించని భగవంతుని విస్మరిస్తుంటాం.

10.మన ప్రజలకు బైబులుతో పరిచయంవుండదు. మనం అలవాటు పడిన 3 ద్వారా మనం దేవునితో మాటలాడ్డమే గాని, బైబులు వాక్యాలద్వారా దేవుడు మనతో మాటలాడుతుంటే వినే అభ్యాసం కలిగించుకోం. ఎందుకంటే బైబులు చదువుకోం గనుక.

11.మనచేత ప్రార్థన చేయించే దివ్యశక్తి పరిశుద్దాత్మ కాని ఆ యాత్మనుగూర్చి మనకట్టే తెలియదు. ఆ యాత్మపట్ల మనకు భక్తీ పరిచయమూ ఉండదు.

12.మనం దైవచిత్తానికి లోబడం. స్వార్ణాభిలాషల ప్రకారం జీవించగోరుతాం. ఆత్మనిగ్రహాన్ని పాటించం, సిలువను అంగీకరించం. ఈలాంటి పరిస్థితుల్లో ప్రార్ధన ఎలా కుదురుతుంది?

13.చాలమందికి దివ్యపూజపట్ల అభిరుచి సన్నగిల్లి పోయింది. దివ్యసత్రసాదాన్ని భక్తితో స్వీకరించరు. క్రీస్తుకు సన్నిహితులు కారు. అలాంటివాళ్లకు సహజంగానే ప్రార్థన కుదరదు.

14.మనం స్వార్థంతో గూడిన ప్రార్థనలకు పూనుకొంటాం. అవిగావాలి ఇవి గావాలి అని దేవుణ్ణి దబాయిస్తాం. ఈలాంటి ప్రార్థనలు ఫలించక పోవడంవల్ల నిరాశజెంది జపం పట్ల వైముక్యం జూపుతాం.

15.ఇక మన అజాగ్రత్త, సోమరితనం, పట్టీపట్టనితనం, రాగద్వేషాలు మొదలైన దుర్గుణాలు ఉండనే వున్నాయి.

3. మన అనుభవం యథార్థమైందేనా?

క్రైస్తవులంగా మనం ఏవో కొన్ని ప్రార్థనలు చేస్తూంటాం. ఈ ప్రార్ధనల వల్ల మనకు కొంతభగవదనుభవం కలిగినట్లుగా గూడ వుంటుంది. కాని మనకు కలిగిందనిపించే ఈ యనుభవం నిజమైందో కాదో నిర్ణయించడం ఏలాగ? యథార్థమైన భగవదనుభవం గడించినవాళ్లల్లో కొన్ని లక్షణాలు కన్పిస్తాయి, వాటిని సంగ్రహంగా ఈ క్రింద పొందుపరుస్తున్నాం.

1.హృదయంలో శాంతీ, సంతృప్తి, ఆనందానుభూతీ నెలకొంటాయి. బాధల్లో వున్నప్పడుగూడ ఒకోమారు ఈ లక్షణాలు కన్పిస్తాయి.