పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతమై పోయింది. ఇది ఓ పెద్ద దురదృష్టమని చెప్పాలి. ఈ లాంటి పరిస్థితుల్లో క్రైస్తవుడు ప్రార్ధనం ద్వారా గాని భగవంతునితో వ్యక్తిగాతానుభవం కలిగించుకోలేడు.

2. ప్రార్థనలో ఎదురయ్యే చిక్కులు

నేటి క్రైస్తవుల ప్రార్థనా జీవితంలో భగవంతుని పట్ల వ్యక్తిగతానుభవం అట్టే కన్పించదని చెప్పాం. దీనికి కారణాలు చాలావున్నాయి. ఇక్కడ కొన్నిటిని పేర్కొందాం.

1.మన జపాలు తరచుగా ఓ కర్మకాండలాగ, ఓ తంతులాగ తయారౌతాయి. వాటిని నోటితో వల్లెవేయడమేగాని హృదయంతో జపించడమంటూ వుండదు.

2.దేవునికి అన్నీ తెలుసు. మన అక్కరలూ తెలుసు. మరి ఇక మనం జపించడం దేనికి అనే భావం కలుగుతుంది.

3.దేవునియందు మనకు విశ్వాసం వుండదు. అతనిపట్ల మనకు వ్యక్తిగతమైన అనుభవం వుండదు, అతని సాన్నిధ్యాన్ని కలిగించుకోం. అతడు తండ్రిలాంటి వాడని అర్థంచేసికోం.

4.అంతరాయంలేని పనిని నెత్తినవేసికొని దానితోనే సతమతమౌతుంటాం. అలసట జెందుతుంటాం. ఇక ప్రార్థనకు వ్యవధివుండదు. పైగా పనినీ ప్రార్థననూ ఒకదానితోనొకటి జోడించడం మనకు చేతగాదు. దేనిలోవుంటే దానిలోనే వుండిపోతుంటాం.

5.మనకు వివిధ ప్రార్థనా పద్ధతులు తెలియవు. ఒకే పద్ధతిని వాడు కోవడంవల్ల విసుగు జెందుతుంటాం. అసలు చాలమందికి ప్రార్ధన అంటే యేమిటో గూడ తెలియదు.

6.భగవంతునిపట్ల అనుభవం గలవాళ్లు, ప్రార్థనను వివరించి చెప్పగలిగేవాళ్ళూ మనచేత ప్రార్థనను చేయించగలిగేవాళ్ళు ఆట్టేదొరకరు. ప్రార్థనయందు అనుభవం గల ఆత్మ గురువులు అరుదు.

7.మనం జనం ప్రార్థనను ఓ గొప్ప విలువగా భావించరు. లౌకిక విషయాల్లో చూపినంత శ్రద్ధ పారమార్థిక విషయాల్లో చూపరు. అందుచేత చిన్ననాటినుండే మనకు ప్రార్ధన మీద మోజుపుట్టదు.

8.మనం సృష్టి వస్తువుల కంటిపెట్టుకొని వుండిపోతాం, ధనం, ఉద్యోగం కీర్తిప్రతిష్టలు, శారీరక సుఖభోగాలు - వీటిని వెదుకుతుంటాం. ఈ సృష్టి వస్తువుల్లో చిక్కుకొని సృష్టికర్తను విస్మరిస్తుంటాం. కనుక మనకు ప్రార్ధనమీదికి మనసుపోదు.