పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువిశేషాన్ని వ్రాసాడు. అతడు మత్తయి వ్రాసిన పరలోకజపాన్నీ ఆ జపానికి ఆధారమయిన మూలరచనలనూ చూచాడు. తాను మాత్రం గ్రీకు క్రైస్తవులకు అర్థమయ్యేలాగ ఆ జపాన్ని కొలది మార్పులతో రచించాడు. మత్తయి పరలోకజపం కొంచెం దీర్ఘంగాను, లూకా పరలోకజపం కొంచెం సంగ్రహంగాను వుంటుంది. ఈ యిద్దరిలో ఎవరి పరలోకప్రార్ధన క్రీస్తు బోధించిన తొలి పరలోక ప్రార్థనకు దగ్గరగా వుంటుంది అనే ప్రశ్నవస్తే, లూకా రచనేనని విజ్ఞల ఊహ. ఇక్కడ మనం మత్తయి రచననే అనుసరిద్దాం. అతని ప్రార్థనలో ఉన్న అంశాలన్నీ లూకా ప్రార్థనలో లేవు.

3. ప్రాచీన పద్ధతి

ఇప్పడు హిందువులు, బౌద్దులు, మహమ్మదీయులు, మొదలైన క్రైస్తవేతరులుగూడ పరలోక జపాన్ని వాడుకొంటుంటారు. కాని ప్రాచీన క్రైస్తవ సమాజంలో ఈజపాన్ని క్రైస్తవులు మాత్రమే వాడుకొనేవాళ్లు దివ్యసత్రసాదాన్ని లాగే ఈ జపాన్ని గూడ క్రైస్తవేతరులకు అందీయకుండా గుప్తంగా వుంచేవాళ్లు, దీని పట్ల అంత భక్తి భావం ఎందుకు? ఇది క్రీస్తే స్వయంగా నేర్చిన జపం. పైగా ఈ జపంలో దేవుణ్ణి అబ్బా (నాన్న) అని పిలుస్తాం, క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లేగాని ఈలా పిలువలేరు. కనుక ఈ జపాన్ని రహస్యంగా వుంచారు. దివ్యసత్ర్పసాదాన్ని లాగే దీన్ని గూడ క్రైస్తవులకు మాత్రమే పరిమితం జేసారు. ఇక ఈ జపంపై వ్యాఖ్యను తిలకిద్దాం.

2. ప్రార్ధనా వ్యాఖ్య

1) మా తండ్రి

ఈ ప్రార్థనారంభంలో దేవుణ్ణి పరలోకంలో వుండే మా తండ్రి అని సంబోధిస్తున్నాం. అన్ని మతాలవాళ్లు దేవుణ్ణి తండ్రి అని పేర్కొన్నారు. ప్రాచీన గ్రీకుమతం దేవుణ్ణి "సేయస్ పాతెర్" అని పిలిచింది. అలాగే రోమను మతం "దివిస్ పాతెర్" అని పేర్కొంది. మన దేశంలో ఆర్యులనాటి వైదిక మతం "ద్యౌస్ పితా" అని పేర్కొంది.

పూర్వవేద ప్రజలకు సుపరిచితులైన సుమేరియనులు బాబిలోనియనులు కూడ దేవుణ్ణి తండ్రి యని పిలిచారు. అతడు సృష్టికర్త అన్న భావంతో వాళ్లు ఆలా పిలిచారు. ఇక పూర్వవేదం దేవుడ్డి 14 సార్లు తండ్రీ అని సంబోధిస్తుంది. సకలజాతులనుండి దేవుడు తమ్మ ఎన్నుకొన్నాడు అన్నభావంతో వాళ్లు అతన్ని ఆలా పిలిచారు. ఉదాహరణకు నిర్గమకాండ 4, 23లో ప్రభువు ఫరోతో “యిస్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్టపుత్రుడు" అన్నాడు. హో షేయా 11,1లో ప్రభువు యిస్రాయేలీయుల నుద్దేశించి "నా కుమారుని ఐగుప్తనుండి