పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకు తెలుసు - లూకా 6,12. పైగా శిష్యులు "యోహాను తన శిష్యులకు ప్రార్ధన నేర్చినట్లే నీవూ మాకు నేర్పించు" అని అడిగారు. ఆ రోజుల్లో ఒక్కో బృందానికి ఒక్కో ప్రార్థనా పద్ధతి వుండేది. పరిసయులు, ఎస్సీనులు, స్నాపక యోహాను శిష్యులు - ఎవరి ప్రార్థనా పద్ధతి వాళ్లదే. క్రీస్తు శిష్యులు మెస్సీయా చుట్టూ చేరిన వాళ్ళ వాళ్ళది మెస్సీయా బృందం. కనుక వాళ్లకుగూడ ఓ ప్రత్యేక ప్రార్ధనావిధానం వండాలి, అందుకే వాళ్ళ యోహాను తన శిష్యులకు నేర్చినట్లే నీవూ మాకు ఓ ప్రత్యేక ప్రార్ధనా విధానం నేర్పమని ప్రభుని అడిగారు. పరలోకజపం నానా జపాల్లో వొకటి కాదు. అది ఓ ప్రార్థనా పద్ధతి.

2. విషయం

పరలోకజపం దైవరాజ్యాన్ని గూర్చి బోధిస్తుంది. ఆ రాజ్య వ్యాప్తిని వర్ణిస్తుంది. కనుక అది వర్తమాన భాగ్యాలనూ భావి భాగ్యాలనూ గూ పేర్కొంటుంది. ఈ ప్రార్థనను ఈలా విభజించవచ్చు; మొదట పరలోక పితను తండ్రీ అని సంబోధిస్తాం. అటుపిమ్మట దేవుని గూర్చి మూడు విన్నపాలు వస్తాయి. అవి దేవుని నామం, దేవుని రాజ్యం, దేవుని చిత్తమూను. ఆ తరువాత నరుని గూర్చి మూడు విన్నపాలు ఉంటాయి, అవి అనుదినాహారం, పాపక్షమాపణం, శోధనలనుండీ కీడులనుండీ విమోచనం. కనుక మొదటి నుండి చివరిదాక ఈప్రార్థన ఓ క్రమపద్ధతిలో రచింపబడిందని తెలుస్తుంది.

ఈ జపంలో బైబులులో విన్పించే ఓ ప్రధానాంశం వస్తుంది. అది, భగవంతుడు తండ్రి లాంటివాడు నరుడు అతని బిడ్డలాంటివాడు అనే సత్యం, కనుక ఈ ప్రార్థనను దేవునిపై పితృభావముంచి జపించాలి. చిన్నబిడ్డ తన తండ్రితో మాటలాడినట్లుగా చనువుతో, నమ్మికతో, ప్రేమతో దేవునికి మనవి చేయాలి, పరలోకమంత్రం మంత్రాలన్నిటికీ రాజమంత్రం, కనుక దీన్ని ఏదో మామూలు మంత్రంలాగ పెదవులతో గబగబ ఉచ్చరిస్తేచాలదు. పరధ్యానంతో రామచిలుకలాగ వల్లిస్తుపోతే చాలదు. మరి అవధానంతో భక్తిభావంతో జపించాలి.

3.ఇద్దరు రచయితలు

నూత్న నేదంలోని పరలోకజపం ఇద్దరు రచయితలనుండి లభిస్తుంది. వీరు మత్తయి; లూకా, మత్తయి సువార్త 6,9-13 వచనాలూ, లూకా సువిశేషం 11,2-4 వచనాలూ ఈ ప్రార్థనను పేర్కొంటాయి. కాలక్రమంలో మొదటి రచన మత్తయిదే. మత్తయి యూద ప్రజలకొరకు సువిశేషాన్ని వ్రాసాడు. కనుక అతని పరలోకజపంలో యూదులు మాత్రమే వాడుకొనే పదాలూ భావాలూ ఉన్నాయి. లూకా గ్రీకుక్రైస్తవుల కొరకు తన