పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. క్రీస్తు దీర్ఘకాలం ప్రార్థన చేసేవాడు. ఓమారు ప్రభువు ఓ నిర్ణన ప్రదేశంలో ప్రార్ధనం చేసికొంటుండగా పేత్రు మొదలైన శిష్యులంతా ఆయన్ను వెదక్కుంటూ వచ్చారు. జనులంతా నిన్ను వెదకుతున్నారని గూడ చెప్పారు. ఈ సన్నివేశం ప్రకారం క్రీస్తు దీర్ఘకాలం ప్రార్థనలో నిమగ్నుడైవుండాలి — మార్కు 1, 85-87. ఐదువేలమందికి ఆహారం పెట్టాక శిష్యులను పడవపై బెత్పయిదాకు పంపి ప్రభువు ఏకాంతంగా కొండసీమకు వెళ్ళి ప్రార్ధన చేసికోమొదలెట్టాడు. ఆ పడవ గాలిలో జిక్కి అతలకుతల మౌతుండగా నాల్గవ జామున, అనగా ఉదయం మూడింటికి, ప్రభువు నీటి మీద నడచి శిష్యుల వద్దకు వచ్చాడు, అనగా ఆ రాత్రంతా ప్రభువు ప్రార్థనలో గడిపాడనే ఊహించాలి. - మార్కు 6,45–48. అలాగే క్రీస్తు శిష్యుల నెన్నుకోవడానికి ముందటి దినం గూడ రాత్రంతా కొండమీద ప్రార్థనలో గడిపాడు - లూకా 6,12.

యూద ప్రజలు మీద నుడివిన మూడు రకాల ప్రార్థనలూ స్వల్పకాలంలోనే చేసి ముగించేవాళ్ళ యూదులు దీర్ఘకాలం ప్రార్ధన చేసేవాళ్ళని పూర్వవేద మెక్కడా పేర్కొనదు. కనుక క్రీస్తు దీర్షప్రార్ధనం యూదుల ప్రార్థన చరిత్రలో ఓ ప్రత్యేకాంశం అనాలి.

3. క్రీస్తు మాతృభాషలో ప్రార్ధించేవాడు. క్రీస్తునాడు యూదులు హిబ్రూ భాషను అట్టేవాడలేదు. దాని స్థానే హిబ్రూ సోదర భాషయైన అరమాయిక్ను వాడుతూవచ్చారు. కాని నాటి యూదులు షేమ టఫిల్ల మొదలైన ప్రార్థనలన్నీ హిబ్రూ భాషలోనే జపించేవాళ్ళ ఐన క్రీస్తమాత్రం అరమాయిక్ భాషలోనే ప్రార్థన చేసేవాడు. అతడు పరలోకజపం గూడ శిష్యులకు అరమాయిక్ భాషలోనే నేర్చాడు. ఆ భాషలో తండ్రికి వాడిన 'అబ్బా" అనే పదాన్ని గ్రీకు నూత్నవేదం కొన్నితావుల్లో పదిలపరచింది - మార్కు 14,36.

4. ఆయా ముఖ్యకార్యాలను ప్రారంభింపకముందు గూడ ప్రభువు ప్రార్థనలో గడిపేవాడు. అతడు జ్ఞానస్నానం పొందుతూ ప్రార్థించాడు - లూకా 3, 21. ఈ జ్ఞానస్నానం ప్రభు జీవితంలో చాల ముఖ్య ఘట్టం, దానితో అతడు బహిరంగ జీవితం ప్రారంభించాలి. పరలోకరాజ్యాన్ని గూర్చి బోధించాలి. తన బోధను అద్భుతాలతో సమర్ధించాలి. కనుక ఈ ప్రార్ధనం అత్యవసరమైంది. అలాగే శిష్యులను ఎన్నుకోకముందూ అతడు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు - లూకా 6, 16. క్రీస్తు ప్రారంభించిన రక్షణ కార్యాన్ని అతని తర్వాత అతని శిష్యులు కొనసాగించాలి. అంతటి ముఖ్యమైన శిష్యులను ఎన్నుకోవాలంటే ప్రార్ధనం అవసరంగదా! క్రీస్తు తబోరు పర్వతంమీద గూడ ప్రార్ధించినట్లు చెప్పంది లూకా