పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ లోకం నీటిబుడగలాంటిదనీ
 మోక్ష భాగ్యమే ముఖ్యమైనదనీ
 ఇహలోక జీవితం క్షణికమైనదనీ
 రానున్న జీవితం శాశ్వతమైనదనీ గ్రహింతునుగాక.
ఓ వైపు నీ తీర్పునకు భయపడుతూ
 మరోవైపు నీ మంచితనాన్ని నమ్ముతూ
 నేను మరణానికి సిద్ధపడుదునుగాక
 నీవు నాకు మంచి మరణాన్ని దయచేసి
నిత్యానందదాయకమైన మోక్షాన్ని ప్రసాదింతువుగాక - 11వ క్లెమెంట్ పోపుగారు

47. క్రీస్తే మనకు సర్వస్వం


 క్రీస్తూ ! నేను నిన్నూ నన్నుగూడ తెలిసికొందును గాక
 నిన్నదప్ప మరిదేన్నీ ఆశింపకుందును గాక
 నన్ను నేను ద్వేషించుకొని నిన్ను ప్రేమింతునుగాక
 నన్ను నేను తక్కువ జేసికొని నిన్ను ఘనపరతునుగాక
 నిన్నుదప్ప మరి దేన్నిగూర్చీ తలంపకుండునుగాక
 నాకు నేను చనిపోయి నీ యందు జీవింతునుగాక
 నాకు జరిగేవన్నీ నీవల్లనే జరిగాయని యెంతును గాక
 నానుండి నేను పారిపోయి నీ శరణు జొత్తునుగాక
 నన్ను తలంచుకొనీ నిన్ను తలంచుకొనీ భయపడుదునుగాక
 నిన్నుదప్ప మరి దేన్నీ ఆశ్రయింపకుందునుగాక
నీవలె నిరుపేదనూ విధేయుడనూ అగుదునుగాక
 నీ వెన్నుకొనినవారిలో నేనును ఒకడనగుదునుగాక
 కడన నిన్ను దర్శించి నీ యందు ఆనందింతునుగాక. 57