పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనీ లోకంలో యాత్రికుణ్ణని గ్రహింతునుగాక
 నాపై అధికారం నెరపేవాళ్లనీ
 నా క్రింద పనిజేసేవాళ్లనీ
 నా మిత్రులనూ శత్రువులనూగూడ
 ప్రేమగౌరవాలతో ఆదరింతునుగాక.
 నా కోపాన్ని శాంతగుణంతోను
 దురాశను ఔదార్యంతోను
 నలివెచ్చనితనాన్ని భక్తితోను జయింతునుగాక
 నన్ను నేను మరచిపోయి
 ఇతరులను పట్టించుకొందునుగాక.
నేను వివేకంతో ప్రణాళికలు వేసికొందునుగాక
 ధైర్యంతో ప్రమాదభరిత క్రియలనుగూడ చేపట్టుదునుగాక
 బాధల్లో ఓర్పునీ, విజయాల్లో వినయాన్నీ ప్రదర్శింతునుగాక
 నేను ఏకాగ్రతతో ప్రార్థన చేయుదునుగాక
 అన్నపానీయాల్లో సంయమనాన్ని పాటింతునుగాక
 శ్రద్ధతో పనిజేయుదునుగాక
 నా సదాశయాలను విడనాడకందునుగాక.
 నా అంతరాత్మ నిర్మలంగాను,
 నా ప్రవర్తన దోషరహితంగాను,
 నా వాక్కు పాప విరహితంగాను,
 నా జీవితం క్రమబద్ధంగాను ఉండునుగాక.
 నేను నా సహజ బలహీనతకు లొంగకుందునుగాక
 నీ ప్రేమపై ఆధారపడి జీవింతునుగాక
 నీయాజ్ఞలను పాటింతునుగాక
 కడన నీ రక్షణాన్ని చేకొందునుగాక.
56