పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను దృఢతరం చేయి
 నా పాపాలకు పశ్చాత్తాపపడుతున్నాను, నా పశ్చాత్తాపాన్ని అధికంజేయి.
 నీవు నాకు ఆది కారణానివి గనుక, నిన్ను ఆరాధిస్తున్నాను
 నాకు అంత్యగతివి కనుక, నీకొరకు ఆశగొంటున్నాను
 నాకు నిరంతరం సాయంచేస్తుంటావు కనుక, నిన్ను స్తుతిస్తున్నాను
 నన్ను కాపాడుతుంటావు కనుక, నీ సహాయాన్ని అర్ధిస్తున్నాను.
నీ జ్ఞానంతో నన్ను నడిపించు
నీ న్యాయంతో నన్ను సవరించు
నీ కరుణతో నన్ను ఓదార్చు
నీ శక్తితో నన్ను కాపాడు.
 ఓ ప్రభూ! నాయాలోచనలు నీపై నిల్చునుగాక
 నా పలుకులు నిన్ను వివరించునుగాక
నా క్రియలు నాకు నీ పట్లగల ప్రేమను రుజువు చేయునుగాక
 నా శ్రమలు నీ మహిమ కొరకు అనుభవింతునుగాక.
 నేను నీవు కొరుకొన్నది చేయుదునుగాక నీవు కోరిన రీతినే చేయుదునుగాక
నీవు కోరుకొన్నంతకాలము చేయుదునుగాక
 కేవలము నీవు కోరినందుననే చేయుదునుగాక.
 ప్రభూ! నా బుద్ధిశక్తిని ప్రబోధించు
నా చిత్తశక్తిని బలపరచు
నా హృదయాన్ని శుద్ధిచేయి
నన్ను పవిత్రపరచు.
 ప్రభూ! నేను పూర్వపాపాలకు పశ్చాత్తాపపడేలా చేయి
 భవిష్యత్తులో రాబోయే శోధనలను ఎదుర్కొనేలా చేయి
 నా సహజ బలహీనతకు లొంగకుండవుండేలా చేయి
నా క్రైస్తవ జీవితాన్ని బలపరుచుకొనేలా చేయి.
 నేను నాదేవుడవైన నిన్ను ప్రేమింతునుగాక
55