పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దయా పూరితుడవునైన ప్రభూ! పశ్చాత్తాపపడేవాళ్ళ అపరాధాలను నీవు మాటిమాటికి క్షమిస్తూంటావు. వాళ్ళ పాపమాలిన్యాన్ని తొలగిస్తుంటావు. నీ యీ దాసుని కరుణించి ఇతని పాపాలను క్షమించు. ఇతడు నిండు మనస్సుతో తాను తప్ప చేసానని వొప్పకొంటున్నాడు. ఇప్పడు వినయంతో నిన్నుమన్నింపు అడుగుకొంటున్నాడు. మానవ బలహీనతవల్లనైతేనేమి, పిశాచ తంత్రాలవల్లనైతేనేమి ఇతని ఆత్మ పాపంలో పడిపోయి చాల మలినమైపోయింది. ఇతన్ని మళ్ళా నీ తిరుసభలో సభ్యునిగాజేయి. ప్రభూ! ఈ భక్తని పశ్చాత్తాప ప్రార్థనలను ఆలించు. ఇతని కన్నీటిని జూచి ఇతనిపై దయజూపు. ఇప్పడు నీ కరుణ వొక్కటితప్ప ఇతనికి దిక్కేమీ లేదు. కనుక ఇతన్ని కరుణించి మల్లా నీ చెంతకు చేర్చుకో, మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని ఆలించు.

44. చనిపోయే వారికొరకు ఆత్మకు ప్రార్ధనం

పావనాత్మమా! చనిపోయే వారినందరినీ నీ సాన్నిధ్యబలంతో ఆదరించు. వారిని నీ శక్తితో దృఢపరచు. నీ ప్రేమతో ఓదార్చు వారి కష్టాల్లో వారికి ఓర్పుని దయచేయి. వారు ఈ లోకంలో కన్నుమూయగానే పరలోకంలో శాశ్వతజ్యోతిని దర్శించేలా చేయి. ఈ లోకాన్ని వదలగానే పరలోకంలో నిత్యానందాన్ని పొందేలాచేయి, అక్కడ కలకాలం నిన్ను దర్శించి సుఖించేలా దయచేయి.

45. మృతులైన విశ్వాసులందరికొరకు

క్రీస్తుప్రభూ! నీవు మృత్యుంజయుడవై ఆర్ధించిన దివ్యఫలాలను జూచి మృతులైన విశ్వాసులను మరణ శృంఖలల నుండి విడిపించు. s నిత్య నివాసంలో వారికి విశ్రామస్థానాన్ని దయచేయి. విశ్వాసం ద్వారా మా కందరికి తండ్రియైన అబ్రాహాము ఒడిలో వాళ్ళ విశ్రమించేలా చేయి. ఆదాము ఏవల నాటినుండి నేటివరకు నిన్ను చిత్తశుద్ధితో సేవించిన వారికందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించు. మా తల్లిదండ్రులకూ తోబట్టవులకూ బంధుమిత్రులకూ స్నేహితులకూ అందరికీ ఈ వరాన్ని ప్రసాదించు. ఓ ప్రభూ! ఈ లోకంలో నిన్ను భక్తితో సేవించినవారి కందరికీ పరలోక రాజ్యంలో భాగం దయచేయి. నీపై మనసునిల్పి జీవించినవారి కందరికీ మోక్షబహుమతిని ప్రసాదించు.

46. అందరూ చెప్పకోదగిన ప్రార్ధనం

ఓ ప్రభూ! నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నా విశ్వాసాన్ని పెంచు నిన్ను నమ్ముతూన్నాను, నా నమాకనీ బలపరచు 54