పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక్కడ నేను సురక్షితంగానే వున్నాను. వైద్యులూ నర్సులూ నన్నుపట్టించుకొని పరామర్శిస్తూనే వున్నారు. అప్పడప్పడూ నాకు తెలిసినవాళ్లు కొందరైనా వచ్చి నన్ను పలకరించి పోతున్నాదు. నేనింకా బ్రతికేవున్నాను. నీకు భక్తితో ప్రార్ధన చేయగల్గుతున్నాను. నా మనసు నిమ్మళంగానే వుంది. నా జీవితపు ప్రాద్దు పడమటికి వాలిన యీ కాలంలో నేను సుమ్మర్లు పడకుండా సంతృప్తిగా జీవించేలా చేయి. ఈ ప్రాయంలో నేను ఏమి చేయగలనో ఏమి చేయలేనో సరిగా గ్రహించేలా చేయి. నా నిస్పత్తువను నేను అంగీకరించేలా చేయి. నీవు నాకు ఇన్నియేండ్ల ఆయుస్సును దయచేసావు. ఇన్ని వరాలిచ్చావు. ఇన్ని విజయాలు ప్రసాదించావు. వీటన్నిటికి నేను కృతజ్ఞడనైయుండేలా చేయి. నా శేషజీవితాన్ని వివేకంతో గడిపేలా చేయి. ఇక నాకు ఎన్నో రోజులు మిగిలిలేవు. నేను వాటిని వ్యర్థంచేసికోగూడదు. కనుక నా భావిదినాలను జాగ్రత్తగా వినియోగించుకొనేలా చేయి. అన్నింటికంటె ముఖ్యంగా నేను నిన్ను నమ్మి జీవించేలా చేయి.

42. మంచి మరణం కొరకు

ఓ సర్వేశ్వరా! నీవు నరులందరు చనిపోవాలని నిర్ణయించావు. ఐనా మా మరణకాలం మాకు ముందుగా తెలియకుండేలా చేసావు. నేను ఈ లోకంలో భక్తిగా జీవించి నిర్మలమైన అంతరాత్మతో పాపరహితంగా చనిపోయేలా అనుగ్రహించు. దివ్య సంస్కారాలను స్వీకరించి వరప్రసాదస్థితిలో కన్నుమూసేలా దయచేయి. నా మరణకాలంలో మరియమాత, సన్మనస్కులు అర్యశిషులు నాకు ఊరటను దయచేయుదురుగాక. నా కావలిసన్మనస్కుడు నా యాత్మను నీ సన్నిధిలోనికి చేర్చునుగాక. నేను నీ దర్శన భాగ్యాన్ని పొంది సకల పునీతులతోపాటు శాశ్వతానందాన్ని అనుభవింతునుగాక.

43. చనిపోయేవారి కొరకు

క్రైస్తవుడా! నీవు ఈ లోకాన్ని విడచిపో, నిన్ను సృజించిన సర్వశక్తిగల తండ్రిపేరు మీదిగా, నీ కొరకు సిలువ మరణం అనుభవించిన దేవుని కుమారుడగు క్రీస్తు పేరుమీదిగా, నీ హృదయంలో వసించి నిన్ను పవిత్రపరచిన పవిత్రాత్మ పేరుమీదిగా, పునీత జోజప్పగారి పేరుమీదిగా, సకలసన్మనస్కుల పేరుమీదిగా, పితరులు ప్రవక్తలు ప్రేషితులు సువిశేషకారుల పేరుమీదిగా, వేదసాక్షులు స్తుతీయులు సన్యాసులు వనవాసుల పేరుమీదిగా, కన్యల పేరుమీదిగా, సకలార్యశీపుల పేరుమీదిగా, ఈ లోకాన్ని విడచిపో, ఈ దినం నీకు శాంతి లభించునుగాక. ఇకమీదట నీవు మోక్షంలో వసింతువు గాక. కరుణామయుడవు 53