పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురైనవారినీ, నయంగాని రోగాలకు బలైనవారినీ, ఇంకా బాధార్తులనూ కరుణించు, నాకు చేతనైనంతవరకు నేను ఇతర రోగులకు సాయపడేలా చేయి. నేను బాధల్లోవున్నవారికి దయా సానుభూతీ చూపేలాచేయి. నన్ను నేను మరచిపోయి ఇతరులను కాస్త పట్టించుకొనేలా చేయి.

33. ప్రభూ! ఆరోగ్యాన్ని దయచేయి

యేసుప్రభూ! నీవు మా యాత్మలనూ దేహాలనూ గూడ నయంజేసే వాడివి. నీవు ఈ భూమిమీద జీవించినపుడు ఎల్లయెడల మంచిని చేసూ సంచరించావు. వ్యాధిగ్రస్తులను ఓదారుస్తూ బాధారులకు ధైర్యం కలిగిస్తూ అనేక రకాల రోగాలను నయంజేస్తూ పర్యటించావు. మేము ఆరోగ్యంగాను ఉల్లాసంగాను జీవించాలని నీవు కోరుకొంటావు. వ్యాధికీ మృత్యువుకీ నీవు శత్రువ్వి నీ వరప్రసాద సహాయంతోను, నీ ద్వారాను మేము రోగాన్నీ మరణాన్నీ జయిస్తాం. ప్రభూ! ఆరోగ్యదాయకాలైన నీ హస్తాలను మాపై చాప, మా రోగాలను తొలగించు. మేము పరిపూర్ణరోగ్యాన్ని పొంది నిన్నుస్తుతించే భాగ్యాన్ని దయచేయి.

34. దేవా! నీ చిత్తప్రకారమే జరగనీయి

దేవా! ప్రేమగలతండ్రీ! అంతా నీ చిత్తప్రకారమే జరగనీయి, నా వ్యాధిబాధలను, ఆనాడు క్రీస్తు నా కొరకు అనుభవించిన బాధలతో చేర్చి నీకే సమర్పిస్తున్నాను. నీ చిత్తమైతే క్రీస్తు అనుభవించిన ధన్యమైన శ్రమలనుజూచి నన్నుకరుణించు. నాకు ఆరోగ్యాన్నీ బాధావిముక్తినీ దయచేయి. జననమరణాలకు కారకుడైన దేవా! నా జీవాన్నీ మరణాన్నీ నీకే సమర్పిస్తున్నాను. నన్ను నీ యిష్టమొచ్చినట్లుగా చేయి. ఆరోగ్యాన్నీ వ్యాధినీగూడ సమానంగానే నీ చేతులనుండి స్వీకరించాలని నా కోరిక. నా యీ మనవిని ఆలించు.

35, ఆరోగ్యమాతా! కరుణించు

ఆరోగ్యమాతవైన మరియా! లోకంలోని రోగులనందరినీ చల్లని చూపన జూడు. స్పృహ కోల్పోయిన వారినీ, చనిపోయేవారినీ, మరణవేదనలో వున్నవారినీ, ఇక నాకు నయం కాదని నిరాశచెందినవారినీ, నొప్పికి తాళలేక విలపించేవారినీ, నిరుపేదలైనందున రోగులైకూడ చికిత్సపొందలేనివారినీ, విశ్రాంతి అవసరమైనాకూడ దారిద్ర్యం వలన తప్పనిసరిగా పనిచేయవలసివవారినీ, పడకపై పరుండి నొప్పికి తాళలేక మరోప్రక్కకు జరగాలనుకొనిగూడ జరగలేనివారినీ, నిద్రబట్టకుండానే రాత్రులు గడిపేవారినీ, కుటుంబ