పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దబాయిస్తాను. ఇతరులచే పరిచర్యలు చేయించుకోవడం నా హక్కుఅన్నట్లుగా ప్రవర్తిస్తాను. నేను జబ్బు పడినపుడల్లా అన్యులు నాకు సేవలు చేస్తూనే వున్నారు. కనుక నాలో స్వార్థం పెరిగిపోయింది. నేను నా మంచిచెడ్డలు తప్పితే ఇతరుల కష్టసుఖాలేవీ లెక్కలోకి రావన్నట్లుగా ప్రవర్తిస్తుంటాను. నాకిష్టమైన పద్ధతిలోనే ఇతరులు నాకు సేవలు చేయాలని పట్టబడతాను. ఇతరులు నాకు సేవలు చేస్తుంటే నేను వాటినట్టే గుర్తింపను. మెచ్చుకోను. చాలసార్లు సహనాన్ని కోల్పోయి సుమ్మర్లు పడుతూంటాను. అసంతృప్తికి గురై చిత్తశాంతిని కోల్పోతూంటాను. నన్నుగూర్చి నేను ఆలోచించుకొన్నపుడు నా పోకడలు సరిగాలేవని గుర్తిస్తూనే వుంటాను. ఐనా నా యవలక్షణాలను మాత్రం సవరించుకోను. ప్రభూ! నా దురుణాలను సవరించుకొనే వరప్రసాద బలాన్ని దయచేయి. విశేషంగా నాకు ఓర్పునీ, R) ర్థబుద్ధినీ, సంతృప్తినీ దయచేయి. ఇతరులు నాకు చేసిన సేవలకు నేను కృతజ్ఞయి వుండేలాచేయి. నేను జబ్బు పడినపుడు ఇతరులను శ్రమపెట్టని రోగినిగా వుండేభాగ్యాన్ని దయచేయి.

31. క్రీస్తు శ్రమలతో చేరి

క్రీస్తుప్రభూ! నీవానాడు కల్వరి మార్గంలోను సిలువ మీదాను నానా బాధలు అనుభవించావు. కనుక నేడు నేననుభవించే బాధలను అర్థంజేసికోగలవు. నావేదనలన్నిటినీ నీకే అర్పిస్తున్నాను. నా శ్రమలలో కొన్నిటిని గురువుల కొరకు వినియోగించు, వాళ్ళు మంచిగురువులుగా ప్రవర్తించేలా చేయి. మరికొన్నిటిని గురుజీవితానికి సిద్ధమయ్యే వారిక"రకు నిరూగించు. వాళ్ళు మంచిగురువులుగా తయారయ్యేలా చేయి, నీ శ్రమలూ మరణం లోకానికి మేలు చేసాయి. నరులను పాపంనుండి రక్షించాయి. నీ శ్రమలతో చేరి నా శ్రమలుకూడ లోకానికి మేలుచేసి పెట్టునుగాక, పౌలు చెప్పినట్లుగా, నీ శ్రమల్లో లోపించిన భాగాన్ని నా శ్రమలు పూరించునుగాక. నేను నా నొప్పినీ బాధనూ నీకే అర్పిస్తున్నాను. నేను అర్పింపగలిగింది ఇంతే దయతో అంగీకరించు.

32. ఇతర రోగుల కొరకు

ఓ ప్రభూ! లోకంలో నేనొక్కడనే జబ్బుగా వున్నాను అన్నట్లుగా ఆలోచించకూడదు. ప్రపంచం నలుమూలలా కోట్లకొలది ඊ*rරාජ්‍ය නෙරපාර అనుభవిస్తున్నారు. కనుక వారందరి కొరకు నీకు విన్నపాలు చేస్తున్నాను. ప్రభూ! ఈ లోకంలో వంటరితనంవల్ల బాధపడేవారినీ, బిడియంవల్ల వేదనలు అనుభవించే వారినీ, ఆందోళనంవల్ల పీడింపబడేవారినీ, నొప్పికి గురై పరితపించేవారినీ, రోగం తిరగబెట్టడంవల్ల శ్రమపడేవారినీ, మొండి వ్యాధులకు