పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. క్రైస్తవ సమైక్యత కొరకు

క్రీసూ! మా ప్రధాన యాజకుడవైన నీవు చనిపోకముందు శిష్యుల కొరకు ప్రార్థించావు. తండ్రి నీయందూ, నీవు తండ్రియందూ నెలకొనియున్నట్లే నీ శిష్యుల కూడ ఐక్యమత్యంతో జీవించాలని జపించావు. నేడు క్రైస్తవులమైన మేము వివిధ శాఖలుగా విడిపోయాం. మా దౌర్భాగ్యానికిగాను మమ్ము కనికరించు. మూ యహంకారంవల్లనైతేనేమి పిశాచం దుష్టత్వంవల్లనైతేనేమి మేము తెచ్చిపెట్టుకొన్నగాయాలను మాన్పు మాలో మమ్ము విభజించే అడ్డుగోడలను కూల్చివేయి. మేము మాలోని విభేదాలనుగాక సామ్యాలను గుర్తించేలా చేయి. క్రైస్తవ బృందాలు ఒకదానికొకటి దూరమయ్యేలాగాక దగ్గరయ్యేలా చేయి. మా విభజనలనుజూచి లోకం నవ్విపోకుండా వండేలా అనుగ్రహించు. మాలోని శాఖలనూ ముఠాలనూ రూపుమాపి మేమందరం నీపేరు మీదిగా ఐక్యమయ్యేలా చేయి, మేమంతా మళ్ళా ఆదిలో వున్న ఏక, పవిత్ర, విశ్వవ్యాప్త, ప్రేషిత క్రెస్తవ సమాజంగా మారిపోయి, ఒకేమంద ఒకే కాపరిగా రూపొందే భాగ్యాన్ని దయచేయి.

29. వ్యాధిగా వున్నపుడు

దేవా! నీవు సర్వశక్తిమంతుడవు, శాశ్వతుడవు. నేను నా బాధలను క్రీస్తు శ్రమలతో చేర్చి నీకు సమర్చిస్తున్నాను. తండ్రీ! క్రీస్తు లోకరక్షణార్థం ఫరోరయాతనలు అనుభవించాలని నీవు నిర్ణయించావు. నేడు నా శ్రమలను క్రీస్తు శ్రమలతో జోడించి నా పాపాలకూ ఇతరుల పాపాలకూ గూడ ప్రాయశ్చిత్తం చేస్తూన్నాను. క్రీస్తు ప్రభూ! నేను నా వ్యాధిని మంచి మనసుతో అంగీకరించేలా చేయి. నీ చిత్తమైతే నాకు శీఫ్రుమే ఆరోగ్యాన్ని ప్రసాదించు. నీవు ఆనాడు పేత్రు అత్తకు వ్యాధినయంచేయగా ఆమె మల్లా తన పనులకు పూనుకొంది. ఆలాగే నేనుకూడ రోగవిముక్తిని పొంది నా పనులను నేను కొనసాగించుకొనిపోయే భాగ్యాన్ని ప్రసాదించు. కాని నేను త్వరగా కోలుకోవడం నీ చిత్తం కాకపోతే ఈ వ్యాధిని మంచి మనసుతో అంగీకరించేలా చేయి. నా జీవితంలోని ప్రతి సంఘటనంలోను నీ సంకల్పాన్ని గుర్తించేలా దయచేయి. నీ కోరిక ప్రకారమే నా జీవితాన్ని కొనసాగించుకొని పోవడం మహాభాగ్యమని యేంచేలా చేయి.

30 ఇతరులను శ్రమపెట్టే రోగిని

ప్రభూ! నన్నుగూర్చి నేను ఆలోచించుకొంటే నాకే సిగ్గువేస్తుంది. నేను అంతసులువైన రోగిని కాను. నేను జబ్బుగా వున్నపుడు ఇతరులు నాకు సేవలు చేయాలని