పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమాజాన్ని మల్లా కుటుంబాలుగా విభజించావు, నేడు మా కుటుంబాన్ని దీవించు. మేమంతా నిస్వార్ధ ಬುದ್ಧಿಪ್ ఒకరినొకరం ప్రేమించేలా చేయి. మేము శాంతి సంతోషాలతో జీవించి నిన్ను సదా స్తుతించేలా చేయి.

15. గర్భవతియైన తల్లి వేడికోలు

ఓ ప్రభూ! నా గుండెకు చేరువలో వున్న ఈ పసికందు పుష్టిమంతంగాను సంపూర్ణంగాను ఎదుగునుగాక, నేను తెలివి తేటలూ అనురాగమూ గల తల్లినై ఈ శిశువును చక్కగా పెంచుదునుగాక, తల్లలకు తల్లివైన మరియమాతా! ఈ గర్భధారణ సమయంలో నీవు నన్ను కాపాడు. నేను పాపానికి లొంగక నా మనస్సును నిర్మలంగా వుంచుకొందునుగాక. ప్రేమనూ పవిత్రతనూ నా బిడ్డలోనికి వూదుదును గాక.

16. ప్రార్థించమని అడిగినవారికొరకు

ప్రభూ! చాలమంది నన్ను తమ కొరకు ప్రార్థించమని అడిగారు. వారి అక్కరలు కూడ చాలవున్నాయి. నన్నడిగినవారి కొరకు జపం చేయడం నా బాధ్యత. కాని నేను అశ్రద్ధవల్ల వారు అడిగినంతగా వారి కొరకు ప్రార్థన చేయలేదు. చాలసార్లు వారినీ వారి అక్కరలను పూర్తిగా మర్చిపోయాను గూడ. కనుక దేవా! నన్నడిగినవారందరి కొరకు ఇప్పడు భక్తితో ప్రార్ధిస్తున్నాను. కరుణతో వారి అవసరాలను తీర్చు నీ చిత్తమైతే వారి యిక్కట్టలను తొలగించు. నీ చేయెత్తి వారినందరినీ దీవించు. వారు నాకు చేసిన మేళ్ళకుగాను నీవు వారిని బహూకరించు.

17. దేవుణ్ణి తెలిసికోవడం

పరిశుద్దుడవు కరుణామయుడవునైన దేవా! నాకు నిన్నర్ధం బేసికొనే బుద్ధిశక్తిని దయచేయి. నిన్ను గుర్తించే తెలివిని ప్రసాదించు. నిన్ను వెదికే వివేకాన్నీ నిన్ను కనుగొనే భాగ్యాన్ని ప్రసాదించు. నిన్ను ధ్యానించే మనసునీ, నీ పలుకులను ఆలించే చెవులనూ, నిన్ను దర్శించే నేత్రాలనూ, నిన్ను ఇతరులకు ప్రకటించే జిహ్వనూ దయచేయి. నేను నీకు ప్రీతి కలిగేలా జీవింతునుగాక. ఓర్పుతో నీకొరకు వేచియుందునుగాక. విసుగు విరామంలేక నిన్ను అన్వేషింతును గాక, నేను నీసన్నిధిలో ప్రశాంతంగా కన్నుమూయుదును గాక. కడన ఉత్తాన భాగ్యాన్ని పొంది మోక్షంలో సదా నిన్ను దర్శించి ఆనందింతునుగాక.