పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. పేదసాదల కొరకు

ఓ ప్రభూ! ఈ లోకంలో చాలమంది పేదరికానికీ ఆకలిదప్పులకూ గురౌతున్నారు. వారికి మాకు చేతనైన సేవలు చేసే భాగ్యాన్ని దయచేయి. మా చేతుల ద్వారా వారికి కూడూ గుడ్డాయిప్పించు. మేము చూపే ఆదరాభిమానాల వలన వారు సుఖశాంతులు అనుభవించేలా చేయి.

12 మనకున్నవీ లేనివీ

ప్రభూ! నాకున్నవి లేనివారితో సంతోషంగా పంచుకొందునుగాక, నాకు లేనివి ఉన్నవారినుండి వినయంతో అడుగుకొందునుగాక. ఇతరులకు నేను చేసిన కీడునకు చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడుదునుగాక. ఇతరులకు కలిగిన మేలునకు అసూయ చెందకుందునుగాక. నీవు నా ప్రార్ధన ఆలించినందులకు నీకు వందనాలు అర్పింతునుగాక.

13. నరులంతా తోబుట్టువులు

తండ్రీ! నీవు నరులను ఎరుప తెలుపు పసుపు నలుపు మొదలైన పెక్కురంగులతో సృజించావు. వారిని పెక్కుజాతులనుగా చేసావు. వారిని పొట్టివారిని గాను పొడుగు వారినిగాను, లావాటి వారినిగాను సన్నని వారినిగాను, సంపన్నులను గాను పేదలనుగాను వృద్దులనుగాను యువకులను గాను, పురుషులనుగాను స్త్రీలనుగాను పెక్కు రకాలుగా చేసావు. ఐనా నరులంతా నీ బిడ్డలే. నీవు అందరికీ తండ్రివి. కనుక మేమంతా తోబుట్టువులం. అందుచే మేము తోడివారితో పోటీకి దిగక వారితో సహకరింతుముగాక. ఇతరులను చిన్నచూపు జూడక వారిని గౌరవింతుముగాక, ఇతరులపై తప్పమోపక వారిని క్షమింతుము గాక. నీ కుమారుడైన క్రీస్తు అందరినీ అంగీకరించి ఆదరించాడు. అతనిలాగే మేముకూడ నరుల్లోని దివ్యత్వాన్ని గుర్తింతుము గాక, నరులంతా నీ కుమారులూ కొమార్తెలేనని గ్రహింతుముగాక. మేము అందరినీ పేమించి అందరితో కలసి ఐకమత్యముగా జీవింతుముగాక. నరజాతి అంతా ఒకే కుటుంబమని విశ్వసింతుముగాక.

14. మన కుటుంబం కొరకు

ప్రభూ! నీవు తండ్రులందరికీ తండ్రివి, తల్లలందరికీ తల్లివి. నీవు స్త్రీ పురుషులను సృజించి వివాహం ద్వారా వారి కలయికను పవిత్రపరచావు. వారిని ఒకరికొకరిని అండగా వుంచావు. వారి సంతతిని అనంతమైన మానవసమాజంగా రూపొందించావు. ఈ బ్రహ్మాండ