పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. స్థలం

మనం జపం జేసికొనే తావుగూడ ముఖ్యం. క్రీస్తు కొండమీదనో, గెత్సెమని తోటలోనో, నిర్ధన ప్రదేశంలోనో జపించేవాడు. ప్రార్ధనానుభవం కలిగిన ఆ ప్రభువు బుద్ధిపూర్వకంగానే ఈ తావులను ఎన్నుకొన్నాడు. ఎందుకు? ఈ స్థలాలలో ఏకాంతంగా వుండవచ్చు. నిష్టతో తండ్రికి ప్రార్ధన చేసికోవచ్చు.

మామూలుగా మనం జపంజేసికోవడానికి కొండ, వనం, నదీసముద్రతీరాలు, రేయి చుక్కలతో నిండిన ఆకాశం బాగా వుపయోగపడతాయి. ఈ తావుల్లో రమ్యమైన ప్రకృతి వుంటుంది. ఈ సుందరప్రకృతి మనం మనసును దేవుని వైపు త్రిప్పకొనేలా చేస్తుంది. మనకు భక్త్యావేశం పుట్టిస్తుంది. ఐనా అందరికీ ఈలాంటి తావులు లభించవు. మనకు దొరికిన తావుల్లోనే మనం జపం జేసికోవాలి.

ప్రార్ధన చేసికోవాలంటే దేవాలయానికి మించినతావులేదు. దానిలోని బలిపీఠం, సిలువ, దీపాలు, స్వరూపాలు, చిత్రాలు అన్నీ భక్తిని పుట్టిస్తాయి. కనుక గుడిలో జపం జేసికోవడం ఉత్తమం, గుడి అందుబాటులో లేనివాళ్లు తమ యింటిలోనే ఓ గదిలోనో ఓ మూలనో జపం బేసికోవచ్చు. కాని రోజూ అదే గదిలో ప్రార్ధనం జేసికోవడం మంచిది. కొన్నాళ్లు నిలకడగా ప్రార్ధనం జేసికోవడంవల్ల ఆయాతావులు పవిత్రమలౌతాయి. ఇక ఆ తావుల్లో జపం సులువుగా కుదురుతుంది.

ఇక్కడే పవిత్ర స్థలాలను గూర్చిగూడ రెండు మాటలు చెప్పాలి. చాలమంది భక్తులు చాలకాలంపాటు ప్రార్ధనం జేయడంవల్ల కొన్ని తావులు పవిత్ర స్థలాలౌతాయి. ఆ తావుల్లో ప్రార్థన ప్రోగుపడి వుంటుంది. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఈలాంటివే. మనం ఈ తావుల్లోకి వెళ్ళినపుడు జపం చేయకుండా వుండలేం, ఈ స్థలాల్లో ప్రార్థనాశక్తి నిక్షిప్తమై వుంటుంది. ఈ శక్తి మనలను ప్రార్థనకు పరికొల్పుతుంది. భక్త్యావేశం పట్టిస్తుంది. ఈ స్థలాల్లో ప్రార్థన చేసికోవడం గొప్ప అదృష్టంగా భావించాలి. అవకాశం కలిగినప్పడల్లా ఈ తావులకువెళ్ళి జపం జేసికోవాలి.

కడన దివ్యసత్రసాద సన్నిధిని గూడ పేర్కొనాలి. ఇక్కడ సాక్షాత్తు దైవసాన్నిధ్యం వుంటుంది. ఇది పరమ పవిత్రమైన తావు. కనుక ఈ తావులో పుట్టేంత భక్తి మరెక్కడా పట్టదు. ప్రార్థనకు యిది అతిశ్రేష్టమైన తావు. కావున మనం వీలైనంతవరకు దివ్యసత్రసాద సన్నిధిలో ప్రార్థన చేయాలి. చాలమంది పునీతులు ఈలానే చేసారు.