పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 278 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకా "క్రీస్తుపేరుమీదిగా” అడగడమంటే అతని యిష్టానికి అనుకూలంగా అడగడం కూడ. అనగా క్రీస్తు తండ్రిని అడగడానికి ఇష్టపడనివాటిని మనం అడగకూడదు. అతని మనసుకి నచ్చనివాటిని మనం కోరగూడదు. ఉదాహరణకు భోగభాగ్యాలు ఆడంబరాలు గౌరవాలు పదవులు క్రీస్తుకి ఇష్టంకావు. వీటిని మనం అడగకూడదు. వినయం సోదరప్రేమ దైవరాజ్యప్రీతి మొదలైనవి క్రీస్తుకి యిష్టం. వీటిని మనం అడగాలి.

6. ఎడతెగక ప్రార్థన చేయాలి

మనకు అవసరమైనవాటిని ఒక్కసారి మాత్రమే అడిగితే చాలదు. చాలసార్లు, మళ్ళీమళ్ళి ఎడతెగక అడుగుతూండాలి. ఈ సూత్రానికి క్రీస్తు చెప్పిన రెండుదాహరణలు మనకు తెలుసు. మూడు రొట్టెలకోసం రాత్రిపూట మిత్రుని దగ్గరికి వెళ్ళినవాడు పదేపదే ప్రాధేయపడి అడిగాడు. అప్పడు అతనికి రొట్టెలు లభించాయి. ఆలాగే మనమూ దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ అడగాలి — లూకా 11, 8-9. ఇంకా పేదరాలు అన్యాయపు న్యాయాధిపతి దగ్గరికి చాలసార్లు వెళ్లి తనకు న్యాయం చేసిపెట్టమని అడిగేది. అప్పడతడు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పాడు, ఈలాగే మనం కూడ రేయింబవళ్ళు దేవునికి మొరపెట్టుకోవాలి - లూకా 18, 5–7, మామూలుగా మనం కొంతకాలం ప్రార్ధన చేస్తాం. దేవుడు మన మడిగింది త్వరగా ఈయకపోతే ఆ ప్రార్థనను అంతటితో ఆపివేస్తాం. ఈలాగైతే మన ప్రార్ధన ఫలించదు. ఇది చెడ్డపద్ధతి. ఇక్కడ మనవిప్రార్థనను గూర్చి చెప్తున్నాం. ప్రార్ధన మనవి, విజ్ఞాపనం, పశ్చాత్తాపం, కృతజ్ఞత, ఆరాధన అని రకరకాలుగా వుంటుంది. ఈ ప్రార్థనలన్నిటినీ చేసికోవలసిందే. ఒక్కోసారి ఒక్కో ప్రార్థన నచ్చుతుంది. ఆత్మే మనచే రకరకాల ప్రార్థనలు చేయిస్తుంది. కాని మనం ఎన్నిరకాల ప్రార్థనలుచేసినా మనవిప్రార్ధనం అవసరం మాత్రం తీరిపోదు. దాన్ని నిరంతరం చేయవలసిందే. ఇక, మనకు తెలిసిన ప్రార్థనల్లోకల్లా అతిశ్రేష్టమైంది పరలోక జపం, ఆ జపమంతా మనమే. కనుక మనం దాన్ని నిరంతరం వాడుకొంటూడాలి. గాంధీగారికి ఈ జపమంటే ఎంతో యిష్టం,

8. ప్రార్థనకు సహాయకారులు

ప్రార్ధనాజీవితం బహు సుకుమారమైంది. జాగ్రత్తగా సంరక్షిస్తేనేగాని అది బ్రతకదు. ఈ లోకంలో చెట్ల, జంతువులు, నరులు మొదలైన ప్రాణికోటి జీవితమంతా సుకుమారమైందే, ప్రాణులు బ్రతకాలంటే తగుమాత్రం వేడివుండాలి. గాలి ఆహారం వండాలి. జబ్బు సోకినపుడు మందులుండాలి. ఇవి లేకపోతే ప్రాణులు నశిస్తాయి. ఈలాగే